మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఆకలి తగ్గించే 10 తక్కువ కేలరీల ఆహారాల గురించి తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jan 17, 2025
Hindustan Times Telugu
ఆకు కూరలు -బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరలను మీ భోజనంలో చేర్చడం వలన కేలరీలు పెరగకుండానే ఆకలిని తగ్గిస్తుంది.
pexels
గుడ్లు - గుడ్లు అధిక నాణ్యమైన ప్రోటీన్. గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.
pexels
బెర్రీలు - స్ట్రా బెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలతో పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. వీటిని స్నాక్స్, పెరుగులో లేదా స్మూతీస్ లో తీసుకోవచ్చు.
pexels
గ్రీక్ యోగట్ -గ్రీకు పెరుగు ప్రోటీన్ తో నిండి ఉంటుంది. ఇది ఆకలి అనుభూతిని తగ్గిస్తుంది. సాధారణ పెరుగుతో పోలిస్తే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ గట్ ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్ లను కలిగి ఉంటుంది.
pexels
సూప్ - మీ భోజనాన్ని ఒక గిన్నె సూప్ తో ప్రారంభిస్తే మీ కేలరీలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సూప్ లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. సూప్ లో కూరగాయలను జోడిస్తే ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది.
pexels
క్వినోవా - క్వినోవాలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. క్వినోవాను సలాడ్ లలో, సైడ్ డిష్ గా లేదా అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు మీకు ఆకలి వేయదు.
pexels
యాపిల్స్ - రోజుకో యాపిల్ ఆకలిని కూడా దూరం చేస్తుంది. యాపిల్స్ లో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది ఎక్కువ కేలరీలు తీసుకోకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
pexels
వోట్స్ - వోట్స్ ఒక అద్భుతమైన అల్పాహారం. ఇది మీకు గంటల తరబడి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది.
pexels
కాటేజ్ చీజ్ - కాటేజ్ చీజ్ తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం. ఇది మీ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.
pexels
చిక్కుళ్లు - బీన్స్, కాయధాన్యాలు, చిక్ పీస్ వంటి చిక్కుళ్లు ప్రోటీన్, ఫైబర్ కు అద్భుత మూలాలు. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. సంపూర్ణ భావన కలిగించి తొందరగా ఆకలి వేయదు.
pexels
గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా లాభాలు