హాట్ సమ్మర్ నుంచి ఉపశమనం కోసం, శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచుకునేందుకు జ్యూసి పుచ్చకాయ చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.   

pexels

By Bandaru Satyaprasad
Mar 15, 2025

Hindustan Times
Telugu

హైడ్రేషన్ హీరో - పుచ్చకాయలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది సహజంగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటానికి ఒక అద్భుతమైన మార్గం. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం ఇది చాలా ముఖ్యం.  

pexels

 పోషకాల పవర్‌ హౌస్- పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

pexels

 చర్మ సంరక్షణ - వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు, చర్మ సంరక్షణకు పుచ్చకాయలోని యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ సహాయపడుతుంది. మీకు వేసవిలో సైతం సహజమైన మెరుపును ఇస్తుంది. 

pexels

వర్కౌట్ వండర్ - పుచ్చకాయలో ఎల్ సిట్రుల్లైన్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది. 

pexels

 యాంటీఆక్సిడెంట్ : పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇన్ ఫ్లమేషన్,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

pexels

హెల్తీ హార్ట్ : పుచ్చకాయలోని విటమిన్లు, మినరల్స్ రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.   

pexels

 ఎముకల బలాన్ని పెంచుతుంది : పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి.

pexels

 జీర్ణశక్తి : పుచ్చకాయలోని ఫైబర్, నీటి శాతం జీర్ణక్రియకు సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

pexels

కళ్లకు ప్రయోనజనం : పుచ్చకాయలో వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి మీ కళ్లను రక్షించడంలో సహాయపడే పోషకాలు ఉన్నాయి. 

pexels

ఉదయం పూట వికారాన్ని తగ్గిస్తుంది - పుచ్చకాయలోని అధిక నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు వికారం, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది మార్నింగ్ సిక్‌నెస్ ఉండే వారికి మంచి ఎంపిక. 

pexels

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash