భారతదేశంలో రవాణా సౌకర్యాల్లో దిచక్ర వాహనాలు చాలా కీలకం. ప్రతీ ఇంట్లో ఒక బైక్ తప్పనిసరిగా ఉంటుంది. బైక్ ల నిర్వహణకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మైలేజీ పెరుగుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే బైక్ మైలేజీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
pexels
By Bandaru Satyaprasad Apr 21, 2025
Hindustan Times Telugu
ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మైలేజీ మెరుగుపడితే మీ డబ్బు ఆదా అవుతుంది. మీ బైక్ మైలేజీని పెంచడానికి, దానిని తిరిగి ట్రాక్‌లో పెట్టేందుకు కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
pexels
నాణ్యత గల ఇంధనం -మీరు ఉపయోగించే ఫ్యూయల్ మీ బైక్ ఇచ్చే మైలేజీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కల్తీ ఇంధనం బైక్ ఇంజిన్ పనిచేయకపోవడానికి దారితీయవచ్చు. బైక్ పార్ట్స్ ఫెయిల్ కావచ్చు. కల్తీ లేని పెట్రోల్ ను నమ్మకమైన బంక్ లలో మాత్రమే కొట్టించుకోండి. అలాగే సరైన ఇంజిన్ ఆయిల్ బ్రాండ్‌ను ఎంచుకోవాలి. ఇది కూడా బైక్ మైలేజీపై ప్రభావం చూపుతుంది.
pexels
సరైన టైర్ ఒత్తిడి- మీ బైక్ మైలేజీ మెరుగుపరచడంలో టైర్ ప్రెజర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ టైర్ ప్రెజర్ ఉన్న సందర్భంలో ఘర్షణ పెరిగి బైక్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. తక్కువ టైర్ ప్రెజర్‌తో రోడ్డు, టైర్ మధ్య కాంటాక్ట్ ప్యాచ్ పెరుగుతుంది. సరైన టైర్ ప్రెజర్‌తో ఇంధన వినియోగం తగ్గి మైలేజీ పెరుగుతోంది.
pexels
ఏరోడైనమిక్స్‌ను ఆప్టిమైజ్ - మీ బైక్ ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరచడం వల్ల ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. స్ట్రీమ్లైన్డ్ విండ్‌షీల్డ్‌తో రైడ్ల సమయంలో గాలి నిరోధకత తగ్గుతుంది. డ్రాగ్‌ను పెంచే స్ట్రీమ్లైన్డ్ రైడింగ్ గేర్ వంటి ఉపకరణాలను ఇన్స్టాల్ చేయకుండా ఉండడమే మంచిది.
pexels
బైక్ నిర్వహణ - క్రమతప్పకుండా బైక్ సర్వీసింగ్ ను షెడ్యూల్ చేయాలి. సీజన్లు మారినప్పుడు బైక్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. బైక్ టైర్ పరిస్థితులు, బ్రేక్, క్లచ్ సెట్టింగ్‌లు, ఇంజిన్ ఆయిల్ లెవల్స్ తనిఖీ చేయించండి. సకాలంలో మరమ్మతులు చేయడం వల్ల బైక్ సజావుగా నడుస్తుంది. దీంతో బైక్ మైలేజీ పెరుగుతుంది.
pexels
ఎకానమీలో బైక్ నడపండి - అధిక వేగంతో బైక్ నడపడం వల్ల థ్రిల్ కలగవచ్చు. కానీ అతివేగం మీకు, మీ బైక్ కు ప్రమాదకరం. ఇది బైక్ మైలేజీపై ప్రభావం చూపుతుంది. మెరుగైన మైలేజీ కోసం 40 నుంచి 55 కి.మీ./గం. వేగంతో డ్రైవ్ చేయాలి. సడెన్ గా అతివేగం, పదే పదే బ్రేకింగ్ నివారించాలి. స్థిరమైన డ్రైవింగ్ మీ బైక్ మైలేజీని మెరుగుపరుస్తుంది.
pexels
ఎక్కువసేపు బైక్ న్యూట్రల్ లో ఆన్ చేసి ఉండడం వల్ల పెట్రోల్ అనవసరంగా తగ్గిపోతుంది. ఇంజిన్ సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. బైక్‌ను ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ఆపాల్సి వస్తే, ఇంజిన్‌ను ఆఫ్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఇంధనం ఆదా అయ్యి ఎక్కువ మైలేజీ వస్తుంది.
pexels
వీల్ చైన్ - చైన్ నిర్వహణ మీ బైక్ ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణ లూబ్రికేషన్, సరైన నిర్వహణతో ఘర్షణ, అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది.
pexels
స్మూత్ గేర్ - సరైన సమయంలో గేర్లు మార్చడం కాకుండా గేర్లు ఎలా మారుస్తారనే దానిపై ఇంధన వినియోగం ఆధారపడి ఉంటుంది. వెంట వెంటనే గేర్లు మార్చడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. తక్కువ ఇంజిన్ ఆర్పీఎమ్ నిర్వహించడానికి, ఇంధన వినియోగాన్ని పెంచే అనవసరమైన త్వరణాన్ని నివారించడానికి గేర్లను సరిగ్గా వినినియోగిచండి.
pexels
ఇంధన వినియోగాన్ని ట్రాక్ చేయండి - మీ బైక్ ఎంత పెట్రోల్ వినియోగిస్తుందో ట్రాక్ చేయండి. దీంతో మీ మైలేజీని ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకోవచ్చు. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏం చేయాలో తరచూ ట్రాక్ చేస్తూ ఉండండి.
pexels
30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?