పీరియడ్స్ ఆలస్యం కాకూడదలంటే ఈ ఆహారాలకు దూరం ఉండండి!

By Ramya Sri Marka
May 13, 2025

Hindustan Times
Telugu

పీరియడ్స్‌ను ఆలస్యం చేయడానికి ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయని చెప్పలేం. కానీ, పలు సందర్భాల్లో కొన్ని ఆహారాలు పీరియడ్స్ రావడాన్ని ఆలస్యం చేశాయి. 

పీరియడ్స్‌ను ఆలస్యం చేసే ఆహారాలు:

నిమ్మరసంలో ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల పీరియడ్స్‌ను ఆలస్యం చేస్తుందని కొందరు నమ్ముతారు.

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా నిమ్మరసం లాగానే పనిచేస్తుందని కొందరు భావిస్తారు.

వేయించిన శనగపప్పును పొడి చేసి సూప్‌లా తీసుకుంటే పీరియడ్స్ ఆలస్యం అవుతాయని కొన్ని సంప్రదాయ వైద్య విధానాలలో చెబుతారు.

గోరువెచ్చని నీటిలో జెలాటిన్ కలిపి తాగితే కొన్ని గంటల వరకు పీరియడ్స్‌ను ఆలస్యం చేయవచ్చని కొందరు నమ్ముతారు.

పుచ్చకాయ, దోసకాయ వంటి చల్లని ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి పీరియడ్స్‌ను ఆలస్యం చేస్తాయని కొందరు అంటారు.

పీరియడ్స్‌ను ఆలస్యం చేయడానికి ప్రయత్నించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

తరచుగా పీరియడ్స్ ఆలస్యం కావడం ఆరోగ్యానికి మంచిది కాదు. హార్మోన్ల అసమతుల్యతకు కూడా దారితీయవచ్చు.

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash