సరిగ్గా నిద్ర పట్టడం లేదా? ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి!
image credit to unsplash
By Sudarshan V Jun 13, 2025
Hindustan Times Telugu
ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా ముఖ్యం. రాత్రిపూట తగినంత నిద్ర పోతే ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటారు. మంచి నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి.
image credit to unsplash
రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్ర పోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం ముగించాలి.
image credit to unsplash
టీవీ, ఫోన్, ల్యాప్టాప్ మొదలైన వాటితో రాత్రిపూట ఎక్కువ సమయం గడపవద్దు. ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగిస్తుంది.
image credit to unsplash
నిద్రకు ఉపక్రమించే ముందు ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి చేసే మెలటోనిన్ హార్మోన్ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.