భోజనం తిన్నాక నడిస్తే మీరు ఊహించని లాభాలు

Pixabay

By Haritha Chappa
Jul 16, 2024

Hindustan Times
Telugu

చాలా మందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. ఫుడ్ తిన్నాక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

Pixabay

భోజనం చేశాక పదినిమిషాలు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ శక్తి పెరుగుతుంది. 

Pixabay

నడవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. పొట్ట ఉబ్బరం, అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు తగ్గుతాయి. 

Pixabay

భోజనం చేశాక ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలా నడవడం వల్ల చక్కెర స్థాయిలుపెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు.

Pixabay

ఆహారం తిన్నాక పది నిమిషాలు నడవడం వల్ల ఒకేసారి రక్తంలో గ్లూకోజ్ పెరగడం జరగదు. కాబట్టి డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది.

Pixabay

ఆహారం తిన్నాక వాకింగ్ చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల మరిన్ని కేలరీలు కరుగుతాయి. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు.

Pixabay

భోజనం తిన్నాక వాకింగ్ చేయడం వల్ల మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. రిలాక్స్‌ గా అనిపిస్తుంది.

Pixabay

గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటే భోజనం చేశాక వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి.

Pixabay

19 మార్చి 2025 రాశి ఫలాలు