వివో వీ27 5జీ సిరీస్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయింది. వివో వీ27, వివో 27 ప్రో ఫోన్లు వచ్చాయి.                                     (Photos Credit: Vivo)

By Chatakonda Krishna Prakash
Mar 04, 2023

Hindustan Times
Telugu

6.78 ఇంచుల కర్వ్డ్ ఎడ్జెస్ 120Hz ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను వివో వీ27, వీ 27 ప్రో ఫోన్లు కలిగి ఉన్నాయి.

Vivo V27 మొబైల్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 7200 ప్రాసెసర్, Vivo V27 Pro ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 8200 ప్రాసెసర్ ఉంటాయి.

ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13పై ఈ మొబైళ్లు రన్ అవుతాయి. 5జీ సపోర్ట్ ఉంటుంది.

వివో వీ27, వీ 27 ప్రో మొబైళ్ల వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ Sony IMX776V ప్రైమరీ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ + 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ రెండు మొబైళ్లు వస్తున్నాయి.

వివో వీ27, వివో వీ27 ప్రో ఫోన్లు 4,600mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి.

Vivo V27 Pro ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.37,999, 8జీబీ + 256 జీబీ ధర రూ.39,999, 12జీబీ + 256జీబీ ధర రూ.42,999గా ఉంది. మార్చి 6న ఫ్లిప్‍కార్ట్, వివో వెబ్‍సైట్, ఆఫ్‍లైన్ స్టోర్లలో సేల్‍కు వస్తుంది.

Vivo V27 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999, 12జీబీ + 256జీబీ ధర రూ.36,999గా ఉంది. మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్లు లభిస్తాయి.

Vivo

సోంపు తింటే ఏమవుతుంది..! ఈ  విషయాలను తెలుసుకోండి

image credit to unsplash