విటమిన్-ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు విటమిన్-ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోండి.
pexels
By Bandaru Satyaprasad Aug 10, 2024
Hindustan Times Telugu
అవకాడో- అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ తో పాటు విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. మీ రోజు వారీ అవసరాలకు కావాల్సిన 40 శాతం విటమిన్-ఇఇందులో ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.
pexels
వీట్ జెర్మ్ ఆయిల్ - వీట్ జెర్మ్ ఆయిల్ లో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేసేందుకు సహాయపడుతుంది.
pexels
సన్ ఫ్లవర్ సీడ్స్, ఆయిల్ - పొద్దు తిరుగుడు విత్తనాలు, విటమిన్-ఇ కి అద్భుతమైన మూలం. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
pexels
బాదం- బాదంపప్పులు విటమిన్-ఇ కి ప్రధాన మూలం. ఇవి చర్మం, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
pexels
రెడ్ బెల్ పెప్పర్- రెడ్ బెల్ పెప్పర్ ఐరన్ కు గొప్ప వనరులు. ఇవి అధిక మొత్తంలో విటమిన్ సి,ఇ కలిగి ఉంటాయి. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో, చర్మ ఆరోగ్యా్న్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
pexels
హాజెల్ నట్స్- హాజెల్ నట్స్ లో విటమిన్-ఇఅధికంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
pexels
వేరుశనగలు- వేరుశనగలు, పీనట్ బటర్ లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది సెల్యులార్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఆక్సీకరణ ఒత్తిని తగ్గించడం ద్వారా గుండె రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.
pexels
పాలకూర- పాలకూరలో విటమిన్-ఇ అధికంగా ఉండటమే కాకుండా ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బచ్చలికూర కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
pexels
బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!