విటమిన్ లోపాలను గుర్తించండి 

ఈ సమస్యలు విటమిన్ లోపాల వల్లనే వస్తాయని మీకు తెలుసా?

PEXELS, RUSH

By Sudarshan V
May 24, 2025

Hindustan Times
Telugu

విటమిన్ లోపాలను గుర్తించడం చాలా కష్టం. వాటి లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి. లేదా ఇతర ఆరోగ్య సమస్యలుగా కనిపిస్తాయి.

PEXELS

మీకు తెలియని విటమిన్ లోపాల యొక్క కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి

PEXELS

జుట్టు ఎక్కువగా రాలడం

జుట్టు  ఎక్కువగా రాలడం ఐరన్ డెఫిషియెన్సీ లేదా థైరాయిడ్ సమస్యకు సంకేతం కావచ్చు. ఇది అలసట, చలిని భరించలేకపోవడం, కండరాల బలహీనత వంటి లక్షణాలను కలిగిస్తుంది.

PINTEREST

పాదాలు లేదా చేతుల్లో మంట, తిమ్మిర్లు

విటమిన్ బి 12 లోపానికి ఇవి సంకేతాలు కావచ్చు. అదనంగా, పొడి చర్మం, అలసట, మతిమరుపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

PEXELS

చిగుళ్ల నుంచి రక్తస్రావం

విటమిన్ సీ లోపం ఉంటే ఈ లక్షణం కనిపిస్తుంది.  అలాగే, గాయాలు కూడా త్వరగా నయం కావు. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది.

PEXELS

ఎముకల నొప్పి

మీకు తరచుగా ఎముకల్లో నొప్పి వస్తుంటే, ఇది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. 40 ఏళ్ల తరువాత రెగ్యులర్ విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

UNSPLASH

తక్కువ వెలుతురులో చూడలేకపోవడం

సరైన కంటి చూపుకు విటమిన్ ఏ చాలా కీలకం. విటమిన్ ఎ లోపం క్రమంగా దృష్టిని దెబ్బతీస్తుంది. ఇది కార్నియా పొడి బారడానికి దారితీస్తుంది,

PEXELS

ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్య సమస్యలకు డాక్టర్లే సరైన పరిష్కారం చూపుతారని గమనించాలి.

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు