విటమిన్ డి ని తరచుగా సూర్యరశ్మి విటమిన్ అని పిలుస్తారు. ఇది శరీరం కాల్షియం, ఫాస్పరస్ గ్రహించడంలో సహాయపడే పోషకం. ఎముకల, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ డి చాలా అవసరం.  

pexels

By Bandaru Satyaprasad
Jun 27, 2024

Hindustan Times
Telugu

మీ శరీరానికి ప్రతి రోజూ తగినంత పోషకాహారం లభించకపోతే విటమిన్ డి లోపం కలుగుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నట్లు ఈ 7 సంకేతాలతో తెలుసుకోవచ్చు.  

pexels

బరువు పెరగడం- విటమిన్ డి లెవల్స్ తక్కువగా ఉంటే కొవ్వును బర్న్ చేసే సామర్థ్యానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇది శరీర బరువు పెరగడానికి దారితీస్తుంది.  

pexels

నీరసం - మీకు అలసటగా అనిపిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల అలసట వస్తుంది. మీ రోజువారీ పనులు కొనసాగించడం కష్టమవుతుంది.  

freepik

మానసిక ఆందోళన - మీ మానసిక స్థితి కల్లోకంగా మారుతుంటే విటమిన్ డి స్థాయిలను ఒకసారి చెక్ చేసుకోండి. విటమిన్ డి లెవల్స్ తగ్గితే డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో వచ్చే అవకాశం ఉంది.  

freepik

కండరాల బలహీనత - విటమిన్ డి లోపంతో కండరాల బలహీనత కలుగుతుంది. బరువులు ఎత్తడానికి, సాధారణ వ్యాయమానికి చాలా కష్టపడతారు. కండరాల తిమ్మిరిని అనుభవిస్తారు.  

freepik

 ఎముకలలో నొప్పి- నిరంతరం ఎముకలలో నొప్పి, ముఖ్యంగా దిగువ వీపు, తుంటి ఎముక, కాళ్లలో నొప్పి వస్తుంటే విటమిన్ డి లోపానికి సంకేతం. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే ఎముకలు సన్నగా, పెళుసుగా ఉండి నొప్పులకు గురవుతాయి. 

freepik

కిడ్నీ, లివర్ సమస్యలు - విటమిన్ డి లోపం కిడ్నీలు, కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి. కిడ్నీ, లివర్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది 

freepik

తరచుగా అంటువ్యాధులు - తరచుగా జలుబు రావడం విటమిన్ డి లోపం సాధారణ లక్షణం. విటమిన్ డి లెవల్స్ తక్కువగా ఉంటే ఇన్పెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.  

freepik

మళ్లీ గ్లామర్ షోతో ఆకట్టుకున్న దేవర బ్యూటి జాన్వీ కపూర్

Instagram