విటమిన్ డి తగినంత ఉండటం అనేది సంతాన సాఫల్యత, ప్రెగ్నెన్సీకి చాలా ముఖ్యం. విటమిన్ డి లోపం వీటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది

pexels

By Hari Prasad S
Jan 29, 2025

Hindustan Times
Telugu

గర్భం దాల్చాలనుకుంటున్న మహిళలు విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. ఈ విటమిన్ లోపం ఉంటే అది సంతాన సాఫల్యతకు ఎంతో అవసరమైన ఏఎంహెచ్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది

pexels

విటమిన్ డి కాల్షియం, ఫాస్పరస్ శోషణకు తోడ్పడుతుంది. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో అవసరం.

pexels

విటమిన్ డి లోపం ఉంటే నెలలు నిండకుండానే ప్రసవం, అబార్షన్, గర్భంలోనే మధుమేహంలాంటి సమస్యలు వస్తాయి

pexels

తగినంత సూర్యకాంతి శరీరంపై పడకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒబెసిటీలాంటి వాటి వల్ల విటమిన్ డి లోపం కలుగుతుంది

pexels

ఆరోగ్యకరమైన గర్భం కోసం విటమిన్ డి స్థాయి 30 ng/ml, అంతకంటే ఎక్కువగా ఉండాలి.

pexels

గర్భం దాల్చిన మహిళలు విటమిన్ డి కోసం డెయిరీ ఉత్పత్తులు, ఫ్యాటీ ఫిష్, గుడ్లు, మష్రూమ్స్‌లాంటివి తీసుకోవడంతోపాటు రోజూ 30 నిమిషాలపాటు సూర్యకాంతి శరీరంపై పడేలా చూసుకోవాలి

pexels

విటమిన్ డి లోపం ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. తగిన సప్లిమెంట్స్ తీసుకోవాలి

pexels

రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash