శరీరానికి విటమిన్ బీ6 చాలా ముఖ్యం. మెదడు పనితీరు, జీవక్రియలు, రోగ నిరోధక వ్యవస్థ సహా చాలా వాటికి ఈ విటమిన్ అవసరం. ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఏడు ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pixabay
సెనగల్లో విటమిన్ బీ6 బాగా ఉంటుంది. సెనగలను మీ ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఈ బి6 విటమిన్ అందుతుంది.
Photo: Pixabay
పాలల్లో కాల్షియమ్, కోలిన్, పోటాషియమ్‍తో పాటు విటమిన్ బీ6, బీ12, విటమిన్ బీ ఉంటాయి. ఇవి మీ ఎముకల దృఢత్వానికి చాలా ఉపయోగపడతాయి.
Photo: Pixabay
టునా, సాల్మోన్ లాంచి చేపల్లో విటమిన్ బీ16 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే శరీరానికి ఈ విటమిన్ బాగా అందుతుంది.
Photo: Pixabay
అవకాడోలో కూడా విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, మెగ్నిషియమ్ కూడా అవకాడో ఫ్రూట్ ద్వారా లభిస్తాయి.
Photo: Pixabay
అరటి పంట్లలోనూ విటమిన్ బీ6, మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే అరటి పండ్లను కూడా మీ ఆహారంలో యాడ్ చేసుకోవాలి.
Photo: Pixabay
పాలకూర, క్యారెట్‍లోనూ విటమిన్ బీ6 ఉంటుంది.
Photo: Pixabay
దంతాలు పసుపుగా ఉంటే మీరు ఎదుటి వారితో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు. మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుంది. ఈ ఏడు ఇంటి చిట్కాలతో దంతాలను తెల్లగా చేసుకోవచ్చు.