నాలుగు భాషల్లో ఓటీటీలోకి  వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: డేట్ ఇదే

Photo: X (Twitter)

By Chatakonda Krishna Prakash
Jun 10, 2024

Hindustan Times
Telugu

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన 15 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

Photo: X (Twitter)

విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ జూన్ 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  

Photo: X (Twitter)

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 14న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రం ఓటీటీలో మరో మూడు భాషల డబ్బింగ్‍లోనూ రానుంది. 

Photo: X (Twitter)

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. 

Photo: X (Twitter)

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్‍సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‍గా నటించారు. అంజలి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది కీలకపాత్రలు చేశారు.

Photo: X (Twitter)

థియేటర్లలో మంచి కలెక్షన్లనే దక్కించుకుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అయితే, రెండు వారాల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 

Photo: X (Twitter)

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash