శంఖం పూలను అపరాజితా పూలు అని కూడా అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఈ పూలకు ఎంతో విలువ ఉంది.
pixabay
ఈ పూలలో యాంటీఏజింగ్ లక్షణాలు ఎక్కువ. ఇది చర్మాన్ని ముసలితనం బారిన పడకుండా కాపాడతాయి.
pixabay
ఈ పూలల్లో యాంటీ గ్లైకేషన్ లక్షణాలు ఎక్కువ. ఇవి ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
pixabay
శంఖం పూల టీని ప్రతిరోజూ తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై గీతలు, ముడతలు పడవు.
pixabay
మీకు మెరిసే ఛాయను అందించడంలో ఈ పూలు ముందుంటాయి. ఈ పూలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నించండి.
pixabay
శంఖం పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అలెర్జీల నుంచి కాపాడతాయి.
pixabay
ఈ శంఖం పూలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
pixabay
శంఖం పూలను ఎండబెట్టి పొడి రూపంలో మార్చుకోవాలి.అలాగే శంఖం పూల నీటిని తయారుచేయవచ్చు. వీటితో హెయిర్ మాస్క్ లు, ఫేస్ మాస్క్ లు వేసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది.