కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఈ పండ్లను తింటే కాల్షియం లోపం కూడా పోతుంది.

Unsplash

By Anand Sai
Jan 28, 2025

Hindustan Times
Telugu

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారడం వల్ల రాగానే కీళ్లలో నొప్పి వస్తుంది. చాలా మంది సప్లిమెంట్లను కూడా తీసుకుంటారు.

Unsplash

ఇందుకోసం మీరు అరటిపండును ఉపయోగించొచ్చు. అరటిపండు అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.

Unsplash

అరటిపండు తినడం వల్ల వాపు తగ్గుతుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిపండ్లు, బాదం, ఎండుద్రాక్షలను షేక్ చేసి తాగవచ్చు.

Unsplash

ఈ షేక్ చేయడానికి 2 అరటిపండ్లు, 5 నుండి 6 బాదంపప్పులు, 10 నుండి 12 ఎండుద్రాక్షలను మిక్సీలో గ్రైండ్ చేసి ప్రతిరోజూ ఈ షేక్‌ను తాగాలి.

Unsplash

అరటిపండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

Unsplash

అరటిపండ్లు విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

Unsplash

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా కీళ్లలో మంట, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Unsplash

పిల్లలు ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash