నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. జిడ్డును, నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ఈ నారింజ తొక్కలను ఎలా వాడాలో చూడండి
pexels
By Hari Prasad S Feb 05, 2025
Hindustan Times Telugu
నారింజ తొక్కలను పొడిగా చేసి రెండు టేబుల్ స్పూన్లను ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15, 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది
pexels
నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని పాలతో కలిపి మూడు, నాలుగు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చర్మంపైన ఉన్న వ్యర్థాలను తొలగించడానికి వాడొచ్చు
pexels
నారింజ తొక్కల పొడిని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కలపాలి. దానిని ముఖానికి రాసుకొని కాస్త మర్దనా చేస్తే ముఖంపై ఉన్న మృత చర్మ కణాలు తొలగిపోతాయి
pexels
నారింజ తొక్కల పొడిని రోజ్ వాటర్లో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నీటిని తొలగించి ఆ పొడిని ముఖానికి, చేతులకు రాసుకుంటే చర్మం మెరుస్తుంది
pexels
నారింజ తొక్కల పొడిని నీటితో కలిపి వాటిని ఐస్ క్యూబ్‌లగా చేసుకోవాలి. ఆ క్యూబ్ లతో ముఖంపై ఉబ్బినట్లుగా ఉండే ప్రదేశాల్లో రాసుకుంటే అవి తగ్గిపోతాయి
pexels
నారింజ తొక్కలను అలాగే తీసుకొని కంటి కింద మర్దనా చేయాలి. ఇందులోని సిట్రిక్ యాసిడ్ వల్ల కళ్ల కింద నల్లటి మచ్చలు తొలగిపోతాయి. వాపు తగ్గుతుంది.
pexels
నారింజి తొక్కల పొడిని షియా బటర్, కొబ్బరినూనెలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దానిని సహజ లిప్ బామ్‌గా ఉపయోగించుకోవచ్చు
pexels
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ శాస్త్రం ప్రకారం వంటల్లో వినియోగించే కొవ్వులు మూడు రకాలుగా విభజించారు.