జుట్టు పొడవుగా పెరగాలంటే అవిసె గింజలు ఇలా వాడండి

pixabay

By Haritha Chappa
Feb 13, 2025

Hindustan Times
Telugu

అవిసె గింజల్లో పోషకాలు ఎక్కువ. వీటిలో జుట్టును పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి. 

pixabay

అవిసె గింజల నూనెను తలకు పట్టించి కాసేపు మర్దనా చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరిగేలా చేస్తుంది.

pixabay

అవిసె గింజలను బాగా ఉడకబెటితే జెల్ లాగా వస్తుంది. ఆ జెల్ లో తేనే కలిపి జుట్టుకు పట్టిస్తే ఎంతో మంచిది. జుట్టు పట్టులా మారుతుంది. 

pixabay

జుట్టు చివర్లు చిట్లకుండా ఉండాలంటే అవిసె గింజల నూనెను మాడుకు తగిలేలా రాయండి. అవిసెగింజల సీరం కూడా వాడవచ్చు.

pixabay

అవిసెగింజలు బాగా నానబెట్టి వాటిని రుబ్బి అందులో పెరుగు కలిపి జుట్టుకు పట్టించండి. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

pixabay

అవిసెగింజలు తినడం ద్వారా కూడా జుట్టును పెంచుకోవచ్చు. అవిసెగింజల స్మూతీలను తయారుచేసుకుని తింటే మంచిది. 

pixabay

అవిసెగింజల నూనెలో గోరువెచ్చని కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు తెగిపోవడాన్ని తగ్గిస్తుంది.

pixabay

అవిసె గింజలు కలిపిన షాంపూను వాడడం అన్ని విధాలా మంచిది. 

pixabay

అవిసెగింజలతో ఎనర్జీ బార్స్ తయారుచేస్తారు. వాటిని అప్పుడప్పుడు తినాలి. 

pixabay

మునగాకుతో ఏ వ్యాధులు నయం అవుతాయో తెలుసా...