తలపై చండ్రును వంటసోడా పోగొడుతుంది.. ఎలా వాడాలి?

Photo: Freepik

By Chatakonda Krishna Prakash
Dec 08, 2024

Hindustan Times
Telugu

వంటసోడా (బేకింగ్ సోడా)లో యాంటీఫంగల్, ఎక్స్‌ఫోలియంట్ గుణాలు మెండుగా ఉంటాయి. తలపై జుట్టుకు పట్టిన చండ్రును ఇది తగ్గించగలదు. జుట్టుకు వంటసోడా ఎలా వాడాలో ఇక్కడ చూడండి.

Photo: Pexels

జుట్టు కుదుళ్లలో (స్కాల్ప్) పీహెచ్ లెవెళ్లను వండసోడా బ్యాలెన్స్ చేస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను యాపిల్ సిడర్ వెనిగర్ తగ్గిస్తుంది. ఈ రెండు కలిపి వాడొచ్చు. 

Photo: Pexels

ఓ గిన్నెలో టీస్పూన్ వంట సోడాలో, ఓ టీస్పూన్ యాపిల్ సిడెర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. దాన్ని కుదళ్లకు రాయాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల తలపై చండ్రు తగ్గుతుంది. 

Photo: Pexels

వంట సోడా, నిమ్మరసంలో  యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. వీటీని కలిపి వాడితే డాండ్రఫ్ తొలగుతుంది. 

Photo: Pexels

ఓ గిన్నెలో ఓ టీస్పూన్ వండసోడా వేసి.. అందులో ఓ నిమ్మకాయ రసం పిండాలి. రెండు బాగా కలుపుకొని స్కాల్ప్‌కు రాసుకోవాలి. ఆరిపన తర్వాత నీటితో వాష్ చేసుకోవాలి. 

Photo: Pexels

జుట్టులో ఉండే అదనపు జిడ్డును పుదీన పోగొట్టగలదు. బేకింగ్ సోడాను దీనికి కలిపితే డాండ్రఫ్ తగ్గేలా చేయగలదు. 

Photo: Pexels

ఓ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో.. అంతే మొత్తంలో పుదీన జ్యూస్ కలపాలి. ఆ తర్వాత దాన్ని స్కాల్ప్‌కు, జుట్టు పట్టించాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి.

Photo: Pexels

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels