ఎర్ర అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ధర కూడా తక్కువే. మీకు ఏదైనా చర్మ సమస్య ఉంటే ఎర్రటి అరటిపండు తినండి.
Unsplash
By Sanjiv Kumar Jan 03, 2025
Hindustan Times Telugu
అరటి పండ్లను వరుసగా 21 రోజుల పాటు తింటే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Unsplash
ఈ ఎరుపు అరటిపండ్లు తినడం వల్ల ఎరుపు, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలు నయం అవుతాయి.
Unsplash
ఎర్రటి అరటిపండ్లు తింటే కంటి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సంతానోత్పత్తి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.
Unsplash
సంతానం కలగలేదనే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ అరటిపండును క్రమం తప్పకుండా తింటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి సంతానోత్పత్తి పెరుగుతుంది.
Unsplash
ఎర్ర అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. నరాల రుగ్మతలు, మూర్ఛతో బాధపడేవారు రోజూ అరటిపండు తింటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
Unsplash
ఎర్ర అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తింటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.
Unsplash
ఈ ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా తినడం ప్రారంభించండి. కానీ, అతిగా తినకండి. ఎందుకంటే అతిగా తింటే ఏదైనా ప్రమాదకరమే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Unsplash
నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? 9 ఆసక్తికరమైన విషయాలు