కీరా దోస - కీరా దోసలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కంటి చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. కీరా దోసను చక్రాలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టండి, కాసేపటి తర్వాత తీసి 10-15 నిమిషాల పాటు కను రెప్పలపై ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేస్తే కంటి చుట్టు ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి.
pexels
కోల్డ్ టీ బ్యాగ్ లు- గ్రీన్ టీలో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్ లను ఫ్రిజ్ లో 30 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత తీసి 10-15 నిమిషాలు కను రెప్పలపై ఉంచండి.
pexels
బంగాళాదుంప ముక్కలు - బంగాళాదుంపలో సహాజమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్ ను నయం చేయడానికి సహాయపడతాయి. ఆలూ ముక్కులను 30 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి, ఆ తర్వాత 10-15 నిమిషాలు కను రెప్పలపై ఉంచండి. రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
pexels
బాదం ఆయిల్ మసాజ్- బాదం ఆయిల్ లో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. నిద్రపోయే ముందు కంటి చుట్టూ ఈ ఆయిల్ తో మసాజ్ చేయండి. రాత్రంతా అలానే ఉంచి ఉదయం గోరువెచ్చటి నీటితో కడగండి. కంటి నల్లటి వలయాలు తగ్గుతాయి.
రోజ్ వాటర్ - రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలిగిస్తాయి. చల్లటి రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్ లు ముంచి, వాటిని కను రెప్పలపై 10-15 నిమిషాలు ఉంచండి. కూలింగ్ అనుభూతి మీ కంటికి ఉపశమనం కలిగించి డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది.
pexels
అలోవెరా జెల్ - అలోవెరా జెల్ ను కంటి చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై నీటితో కడగండి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి.
pexels
టమాటా జ్యూస్ - టమాటాలో బ్లీచింగ్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి నల్లటి వలయాలను తగ్గిస్తాయి. టమాటా రసం, నిమ్మ రసం మిక్స్ చేసి కాటన్ తో మీ కంటి భాగంలో అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.