శరీరానికి రక్షణ కల్పించే ఆహారంలో టమాటా కీలక పాత్ర పోషిస్తుంది. 

By Bolleddu Sarath Chandra
Jan 21, 2025

Hindustan Times
Telugu

రక్తాన్ని శుభ్రం చేయడంలో టమాటా అద్భుతంగా పనిచేస్తుంది.

టమాటాను ఆహారంలో వినియోగించక ముందు దానిని  విషపూరితంగా భావించేవారు. కడుపులో యాసిడ్లను ఉత్పత్తి చేస్తుందనే అపోహపడేవారు.

టమాటా శరీరంలో రక్తాన్ని, శరరీ కణజాలాన్ని కలుషితం చేస్తుందని, పోషక  విలువలు ఏమి ఉండవని,  ఆహారానికి రంగు, రుచి కోసమే ఉపయోగిస్తారనే అపోహాలు ఉండేవి.

టమాటాలో కార్బో హైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.  మధుమేహ రోగులకు  చక్కటి ఆహారంగా ఉపయోగపడుతుంది.  మూత్రంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది.

రేచీకటి, హ్రస్వ దృష్టి విటమిన్ లోపాల వల్ల వచ్చే కంటి లోపాలను నివారించడానికి  టమాటా ంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.  కంటి సమస్యలను పరిష్కరించడానికి టమాటా ఉపయోగపడుతుంది. 

టమాటా ఆకుల్ని కోసి 15 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే  కంటి ఆరోగ్యం మెరుగు అవుతుంది. 

రోజుకు ఒక టమాటా తింటే మూత్రంలో యాసిడ్‌ నిల్వలు తగ్గుతాయి. మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. 

నిత్యం బ్రేక్‌ ఫాస్ట్‌ బదులు  ఒకటి రెండు పండిన టమాటాలు తింటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. 

అప్పుడే తీసిన టమాటా జ్యూస్‌‌లో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి  ఉదయాన్నే తాగితే  మార్నింగ్ సిక్‌నెస్‌, కామెర్లు, అజీర్ణ్ం, కడుపులో గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వల్ల వచ్చే సమస్యల్ని అధిగమించవచ్చు. 

టమాటా మొక్క  ఆకుల్ని కోసి అందులో రసాన్ని పిండి అందులో సమానపాళ్లలో తులసి రసం కలిపి  ఆ రసాన్ని మరిగించి  వచ్చే మిశ్రమాన్ని  కీళ్ల నొప్పులకు ఔషధంగా వినియోగించవచ్చు.

పడుకునే ముందు శుభ్రం చేసిన వెల్లుల్లి తునకల్ని మింగిన తర్వాత టమాటా రసం లో తేనె, యాలకుల పొడి కలిపి తాగితే శ్వాసకోశ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

ఉబ్బసం వ్యాధులకు టమాటా రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 

టమాటాలు పండే కొద్దీ వాటిలో సి విటమిన్ పెరుగుతుంది. అప్పుడే తీసిన టమాటాల్లో  పుష్కలంగా సీ విటమిన్ ఉంటుంది. 

టమాటాలో తేమ 94శాతం, ప్రొటీన్లు 0.9శాతం, కొవ్వు 0.2శాతం, ఖనిజ లవణాలు 0.5శాతం, పీచు 0.8శాతం, కార్బోహైడ్రేట్స్‌ 3.6శాతం ఉంటాయి. 

టమాటాలో కాల్షియం, ఐరన్; విటిమన్‌ సి, కెరోటిన్‌,  థయిమిన్, 

నెయ్యిని ఎందుకు వాడాలో తెలుసా..! ఈ 6 కారణాలు తెలుసుకోండి

image credit to unsplash