చీరలకు అందమైన బ్లౌజ్ డిజైన్స్ కావాలా? అయితే, ఈ హీరోయిన్స్‌ను ఫాలో అయిపోండి!
Instagram
By Sanjiv Kumar Jan 20, 2025
Hindustan Times Telugu
ఈ మధ్య చీరతో పాటు బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ బాగా ట్రెండ్ అవుతోంది. చీర బ్లౌజ్‌పై ఎలాంటి డిజైన్ వేసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఈ బాలీవుడ్ హీరోయిన్స్ చీర బ్లౌజ్ డిజైన్లను ఫాలో అవ్వొచ్చు.
Pinterest
వైట్-గ్రే మిక్స్‌డ్ చీర కోసం నటి శ్రద్ధా కపూర్ డిఫరెంట్ స్టైల్ బ్లౌజ్ ధరించింది. ఆల్టర్నెక్ డిజైన్‌తో ఉన్న ఈ బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది.
Instagram
దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ ఎరుపు రంగు చీరలో, ఆకుపచ్చ బ్లౌజ్‌తో అదరగొట్టింది. ఆమె ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించింది.
Pinterest
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ బ్లౌజ్ డిజైన్‌తో కూడిన బ్లౌజ్‌ను ధరించింది. పింక్ చీరకు ఈ బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది.
Instagram
శర్వారి వాఘ్ మినీ బ్లౌజ్ ధరించి నలుపు రంగు చీరకు అందంతోపాటు హాట్‌గా కనిపిస్తోంది.
Pinterest
మ్యాచింగ్ ఫుల్-నెక్ బ్లౌజులు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ ధరించిన చీర, బ్లౌజ్ డిజైన్ బాగా సరిపోతుంది.
Instagram
ఆర్ఆర్ఆర్ బ్యూటి అలియా భట్ ధరించిన ట్యూబ్, కార్సెట్ బ్లౌజ్ చూడటానికి సింపుల్‌గా కనిపించినా బాగా సరిపోతుంది. గ్లామరస్‌గా ఉండాలనుకునే వారు ఈ తరహా బ్లౌజ్ వేసుకోవచ్చు.
Instagram
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ మ్యాచింగ్ సీక్వెన్స్ బ్లౌజ్ ధరించింది. దీంతో నటికి డిఫరెంట్ లుక్ వచ్చింది.
Instagram
ఫుల్ స్లీవ్ బ్లౌజ్ కొన్ని చీరలకు బాగా సరిపోతుంది. ఇక్కడ కల్కి 2898 ఏడీ హీరోయిన్ దీపికా పదుకొణె బనారసి చీర కోసం ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించి అట్రాక్ట్ చేసింది.
Pinterest
బ్యాక్ లెస్ బ్లౌజ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సోనమ్ కపూర్ ధరించిన బ్యాక్ లెస్ బ్లౌజ్ డిజైన్ ఇలా ఆకర్షిస్తుంది.
Instagram
శిల్పా శెట్టి ధరించిన కార్సెట్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది. ఇలా చీర కట్టుకునేటప్పుడు కార్సెట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
Instagram
ఒక్క లైన్‌తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్‌లు ఇవి..