ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత్ లో సూర్యగ్రహణం(Solar Eclipse in India) కనిపించదు. మెక్సికో, యూఎస్ఏ, కెనడా దేశాల్లో సూర్య గ్రహణం కనిపిస్తుంది.  

pexels

By Bandaru Satyaprasad
Apr 08, 2024

Hindustan Times
Telugu

సూర్యగ్రహణం అనేది ఖగోళ దృగ్విషయం. చంద్రుడు.. భూమి, సూర్యుడి మధ్యకు రావడంతో... సూర్యుని కాంతి భూమిపై పడకుండా పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటాడు.  

pexels

ఏప్రిల్ 8న ఏర్పడే సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలో స్పష్టం కనిపిస్తుంది. ఏడేళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరో 20 ఏళ్ల వరకూ యూఎస్ లో ఇలాంటి గ్రహణం ఏర్పడదని తెలిపారు.  

pexels

మెక్సికో, యూఎస్, కెనడా మధ్య 185 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది. దీనిని టోటాలిటీ అని కూడా పిలుస్తారు. 18 యూఎస్ రాష్ట్రాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. భారత్ లో కనిపించదు. 

pexels

భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభం అవుతుంది. సంపూర్ణ గ్రహణం రాత్రి 10:08 గంటలకు మొదలవుతుంది.  

pexels

ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 2:22 గంటలకు సూర్యగ్రహణం ముగుస్తుంది. మెక్సికో పసిఫిక్ తీరంలో ఆ దేశ కాలమానం ప్రకారం PDT 11:07 AM కనిపిస్తుంది.    సంపూర్ణ సూర్యగ్రహణం 4 నిమిషాల 27 సెకన్ల వరకు ఉంటుంది.  

pexels

సూర్యగ్రహణాన్ని NASA యుట్యూబ్(https://youtu.be/2MJY_ptQW1o) లో లైవ్ ఇస్తుంది. ఏప్రిల్ 8న రాత్రి 10.30(IST) నుంచి తెల్లవారుజామున 1:30 (IST) వరకు లైవ్ ఇస్తారు.  

pexels

యూఎస్ లోని 18 రాష్ట్రాలలో వందలాది నగరాలు, చిన్న పట్టణాలు సూర్యగ్రహణ మార్గంలో ఉన్నాయి. మొత్తం 31 మిలియన్ల మంది అమెరికన్లు సూర్యగ్రహణాన్ని ప్రత్యేక్షంగా వీక్షించే మార్గంలో ఉన్నారు.   

pexels

అనారోగ్యం నుంచి కోలుకునేందుకు తోడ్పడే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels