నిమ్మ, అల్లంల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి నిమ్మ-అల్లం టీ (లెమన్ జింజర్ టీ) చేసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..
Photo: Pexels
నిమ్మ అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. అజీర్తిని తగ్గించే గుణాలు ఈ రెండిటిలోనూ పుష్కలంగా ఉంటాయి.
Photo: Pexels
శ్వాసకోశ ఇబ్బందులు తగ్గేందుకు లెమన్-జింజర్ టీ చాలా ఉపయోగపడుతుంది. ఇది తాగడం వల్ల శ్వాసను సులువుగా పీల్చగలుగుతారు. జలుబు చేసినప్పుడు ఇది మంచి ఆప్షన్‍గా ఉంటుంది.
Photo: Pexels
నిమ్మ-అల్లం టీ వాంతులను కూడా నివారించగలవు. ఉదయాన్నే అనారోగ్యంగా ఫీలయ్యే వారికి ఈ టీ చాలా మేలు చేస్తుంది.
Photo: Pexels
లెమన్-జింజర్ టీ తాగడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రిలాక్స్ అయిన ఫీలింగ్ కల్పిస్తుంది.
Photo: Pexels
నిమ్మ అల్లం టీ శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా కూడా తోడ్పడుతుంది.
Photo: Pexels
నిమ్మ-అల్లం టీ చేసుకునేందుకు ముందుగా ఓ పాత్రలో మూడు కప్పుల నీటిని మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడే అల్లం, నిమ్మరసం వేసుకోవాలి. అన్నింటినీ బాగా మరిగించాక ఆ టీని వడగట్టుకోవాలి. రుచికి సరిపడా తేనె వేసుకొని తాగొచ్చు.
Photo: Pexels
వేసవిలో శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇవిగో చిట్కాలు