నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.  

pexels

By Bandaru Satyaprasad
Feb 09, 2025

Hindustan Times
Telugu

స్క్రీన్ టైమ్- నేటి  డిజిటల్ యుగంలో నిద్రపోయే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.  అయితే ఫోన్లు, టాబ్లెట్ల వల్ల నాణ్యమైన నిద్ర దెబ్బతింటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు నీలి కాంతిని విడుదల చేస్తాయి. ఇది మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి స్లీప్ సైకిల్ ను  ప్రభావితం చేస్తుంది. పడుకునే ముందు గంట లేదా రెండు గంటల ముందు ఎలక్ట్రానిక్స్‌కు దూరంగా ఉండటం మంచిది. 

pexels

కెఫిన్ - మనలో చాలా మంది రాత్రుళ్లు కాఫీ, టీ తాగుతుంటారు. కెఫిన్ శరీరంలో 10 గంటల వరకు ఉంటుంది. ఇది మీ నిద్రకు భంగం కలిగించవచ్చు.  సాయంత్రం కెఫిన్ మానుకోవడం మంచిది.  

pexels

మద్యం సేవించవద్దు - మద్యం తాగడం వల్ల మగత వస్తుంది. అయితే నిద్రపోయే ముందు మద్యం తాగడం చెడ్డ అలవాటు. ఇది నిద్ర ఫార్ములేషన్ ను  దెబ్బతీస్తుంది. రాత్రిపూట అతిగా తాగితే తలనొప్పి ఇబ్బందులు ఎదుర్కొంటారు.  

pexels

 ధూమపానం వద్దు - సిగరెట్లలోని నికోటిన్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. సిగరెట్ల వల్ల రాత్రిపూట విశ్రాంతి పొందడం కష్టమవుతుంది.

pexels

ఉత్తేజపరిచే కార్యకలాపాలు- రాత్రుళ్లు ఉత్తేజపరిచే పనులు మానుకోండి. చదవడం, వీడియో గేమ్‌లు లేదా భావోద్వేగ సంభాషణలు...ఇవన్నీ ఉత్తేజకరమైన కార్యకలాపాలకు దారితీయవచ్చు. నిద్రపోయే ముందు ఇవి మంచివి కావు. ఈ కార్యకలాపాలు అడ్రినలిన్, కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయి. ఇవి నిద్రపోయే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి.   

pexels

ఎక్కువ నీరు తాగడం- నీరు ఆరోగ్యానికి మంచిదే కానీ పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం వల్ల నిద్ర సైకిల్ కు అంతరాయం కలుగుతుంది. పడుకునే ముందు ఎక్కువ నీరు తాగడం వల్ల రాత్రిపూట బాత్రూమ్‌కు వెళ్లడానికి ఎక్కువ సార్లు మేల్కొంటారు. ఇది గాఢమైన నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. పడుకునే ఒకటి లేదా రెండు గంటలు ముందు నీరు తాగండి. దాహం వేస్తే కొద్ది నీరు తీసుకోండి.

pexels

చక్కెర ఆహారాలు - రాత్రి భోజనం తర్వాత డెజర్ట్ తింటే బాగుంటుందని అనిపిస్తుంది కానీ నిద్రపోయే ముందు ఎక్కువ చక్కెర తీసుకోవడం మంచిది కాదు. ఇది మీ రక్తంలో చక్కెర, శక్తి స్థాయిలలో పెరుగుదలకు కారణమవుతుంది. నిద్రపోయే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది.   

pexels

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest