నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు

By Chatakonda Krishna Prakash
Apr 19, 2025

Hindustan Times
Telugu

ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘నెట్‍ఫ్లిక్స్’లో ఈ నెల (ఏప్రిల్ 2025)లో చాలా చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యమైన సినిమాలు ఉన్నాయి. కొన్ని బ్లాక్‍బస్టర్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి.

Photo: X (Twitter)

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. మిస్ కాకుండా చూడాల్సిన చిత్రాలు ఇవి!

Photo: X (Twitter)

కోర్ట్ సినిమా ఏప్రిల్ 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ బ్లాక్‍బస్టర్ తెలుగు లీగల్ డ్రామా మూవీలో ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్ చేశారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలో థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ సాధించింది. 

Photo: X (Twitter)

బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘ఛావా’ ఏప్రిల్ 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. ఛత్రపతి సంభాజీ మహరాజ్‍గా విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై భారీ హిట్‍గా నిలిచింది. 

Photo: X (Twitter)

టెస్ట్ సినిమా ఏప్రిల్ 2న నెట్‍ఫ్లిక్స్‌లోకి వచ్చింది. మాధవన్, నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్చ్ చేసిన ఈ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో స్ట్రీమ్ అవుతోంది. 

Photo: X (Twitter)

పెరుసు సినిమా ఏప్రిల్ 11నే నెట్‍ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ తమిళ కామెడీ డ్రామా చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది. వైభవ్, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో మోస్తరుగా ఆడిన ఈ మూవీ స్ట్రీమింగ్‍లో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. 

Photo: X (Twitter)

క్రావెన్ ది హంటర్ ఏప్రిల్ తొలివారంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమ్ అవుతోంది. ఆరోన్ జాన్సన్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేకపోయింది. 

Photo: X (Twitter)

చియా విత్తనాలు చూడటానికి చిన్నవిగా ఉండవచ్చు. కానీ వాటికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash