ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన టాప్ 5 మహిళా క్రికెటర్లు వీళ్లే!
By Sanjiv Kumar Jan 31, 2025
Hindustan Times Telugu
క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటి. భారతదేశం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు.
మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లకు తగ్గకుండా ప్రజాదరణ పొందుతున్నారు. అలాగే, వారి ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటోంది.
ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ధనవంతులైన మహిళా క్రికెటర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. ఈ సమాచారం పలు మీడియా నివేదికల ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఎలిస్ పెర్రీ: ఆస్ట్రేలియా, RCB మహిళా క్రికెటర్ అయిన ఎలిస్ పెర్రీ ఆస్తులు దాదాపు రూ.121 కోట్లు. ఫిఫా ప్రపంచ కప్, క్రికెట్ వరల్డ్ కప్ రెండింటిలోనూ ఆమె ఆడింది.
మెగ్ లానింగ్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఆస్తులు రూ. 75 కోట్లు. ఆమె ఆస్ట్రేలియా జట్టుకు చాలా విజయవంతమైన కెప్టెన్.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆస్తులు రూ. 42 కోట్లు.
భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆస్తులు దాదాపు రూ. 34 కోట్లు.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తులు దాదాపు రూ. 26 కోట్లు.
గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా లాభాలు