మఖానాను ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తాయి. ఇది తేలికైన పోషకమైన చిరుతిండి. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. మనాఖాను తినడానికి 5 రుచికరమైన మార్గాలు తెలుసుకుందాం.
pexels
రోస్టెడ్ మఖానా - పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి వేసి మఖానాను వేయించాలి. చిటికెడు ఉప్పు, నల్ల మిరియాలు లేదా పసుపుతో కలపండి. ఇది మంచి క్రంచీ స్నాక్.
pexels
మఖానా చాట్ - రోస్ట్ చేసిన మఖానాకు టమాటాలు, ఉల్లిపాయలు, కీరదోస వంటి తాజా కూరగాయలు, జీలకర్ర పొడి, కొద్దిగా కారం, నిమ్మరసం కలపండి. దీంతో మీకు రుచికరమైన చాట్ తయారవుతుంది. ఇది తక్కువ కేలరీలు, ఫైబర్ తో నిండిన చిరుతిండి.
pexels
మఖానా ఖీర్ - ఇది సంప్రదాయమైన రైస్ ఖీర్ కు ప్రత్యామ్నాయం. తక్కువ ఫ్యాటీ మిల్క్ తో మఖానాను ఉడికించి తేనె లేదా బెల్లంతో కలపాలి. రుచి కోసం యాలకులు జోడించండి. ఇది ప్రోటీన్, కాల్షియంతో నిండిన పోషకమైన డెజర్ట్.
pexels
మఖానా కర్రీ- టమాటాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర వంటి వాటితో మఖానా కర్రీ తయారుచేసుకోండి. క్రీమీ టెక్స్చర్ కోసం తక్కువ ఫ్యాటీ క్రీమ్ లేదా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కడుపు నింపే హెల్తీ ఫుడ్.
pexels
మఖానా రైతా
pexels
రోస్ట్ చేసిన మఖానాకు పెరుగు, కీరదోస, జీరకర్ర పొడితో కలపండి. ఈ రిఫ్రెషింగ్ మఖానా రైతా మీ కడుపునకు తేలికగా ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు