భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jan 22, 2025
Hindustan Times Telugu
గుల్మార్గ్- మంచు దుప్పటితో కప్పబడిన ప్రకృతి అందాలు, స్కీయింగ్, రిసార్ట్ కలయికతో కశ్మీర్ లోని గుల్ మార్గ్ అద్భుతంగా ఉంటుంది. వింటర్ హనీమూన్ జంటకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్.
pexels
డార్జిలింగ్ -కాంచనగంగా అందాలు, ప్రకృతి అద్భుతాలు...డార్జిలింగ్ ను వింటర్ హనీమూన్ డెస్టినేషన్ చేశాయి. ఇక్కడి బొమ్మ రైలు ప్రయాణాన్ని అస్సలు మిస్ కాకూడదు.
pexels
డామన్ అండ్ డయ్యూ - డామన్ అండ్ డయ్యూలో అందమైన బీచ్ లు మీ వింటన్ హనీమూన్ కు బెస్ట్ డెస్టినేషన్. పోర్చుగీస్ ఆర్కిటెక్చర్, ప్రశాంతమైన వాతావరణం మీ ట్రిప్ ను ఉల్లాసంగా మారుస్తాయి.
pexels
డల్హౌసీ - డల్హౌసీలో మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ అడవుల అందాలను వీక్షించవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను కోరుకునే జంటలకు ఈ ప్లేస్ బెస్ట్.
pexels
కూర్గ్ -కర్ణాటలోని కూర్గ్ ను 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. హనీమూన్ జంటలకు ఇది చక్కటి ప్రదేశం. కాఫీ తోటలు, జలపాతాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని జంటగా ఆస్వాదించవచ్చు.
pexels
మున్నార్- కేరళలోని మున్నార్ పచ్చని టీ ఎస్టేట్ లు, కూల్ వెదర్ మీ వింటర్ హనీమూన్ కు బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు సుందరమైన జలపాతాలు, ప్రకృతి అందాలను అన్వేషించవచ్చు.
pexels
ఊటీ - ఊటీలో చల్లని వాతావరణం, ప్రకృతి దృశ్యాలు, అందమైన తోటలను ఆస్వాదించవచ్చు. ఈ హిల్ స్టేషన్ లో రైలు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.
pexels
ఉదయ్ పూర్ - ఉదయపూర్ సరస్సులు, రాజభవనాలు, గొప్ప సంస్కృతికి నెలవు. చరిత్ర తెలుసుకుంటూ...రాయల్ హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు ఉదయ్ పూర్ బెస్ట్ ప్లేస్.
pexels
నైనిటాల్- నైనిటాల్ లోని నైని సరస్సు, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రశాంతమైన శీతాకాల విడిదిని అందిస్తాయి. బోటింగ్, మంచులో వాకింగ్, అద్భుతమైన హిమాలయ పర్వతాల అందాలను ఆస్వాదించవచ్చు.
pexels
జైసల్మేర్ - జైసల్మేర్ లోని గోల్డెన్ సాండ్, గంభీరమైన కోటలు, ఒంటె సవారీలు, ఎడారి సాహసాలు మీ వింటర్ హనీమూన్ కు అద్భుతంగా మారుస్తాయి.
pexels
ఖాళీ పొట్టతో గుడ్డు తినకూడదా? తింటే జరిగే నష్టం ఏమిటి?