ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు- అన్నీ ఒకేదాంట్లో!

By Sanjiv Kumar
Jan 30, 2025

Hindustan Times
Telugu

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ వారం ట్రెండ్ అవుతున్నటాప్  10 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

విడుదలై పార్ట్ 2

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన సినిమా విడుదలై పార్ట్ 2. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రెండింగ్‌లో ఉంది.

ఐ వాంట్ టు టాక్

అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 2 స్థానంలో ఉంది.

ది కిల్లర్స్ గేమ్

ఈ అమెరికన్ సినిమా భారతదేశంలో ట్రెండింగ్‌లో టాప్ 3 స్థానంలో ఉంది.

సింగం ఎగైన్

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమా సింగం ఎగైన్. ఈ మల్టీస్టారర్ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనే వంటి వారు నటించారు.

విడుదలై పార్ట్ 2

విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ టాప్ 5వ స్థానంలో ఉంది.

మిస్ యూ

మిస్ యూ అనే తమిళ సినిమా టాప్ 6వ స్థానంలో ఉంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆనంద్ శ్రీబాల, అల్లరి నరేష్ బచ్చల మల్లి, విడుదలై పార్ట్ 1 సినిమాలు వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.

అలంగు సినిమా 10వ స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సబ్‌స్క్రైబర్లు ఈ సినిమాలలో మీకు నచ్చిన మూవీని చూడవచ్చు.

ప్రేమికులే కాదు.. ఫ్యామిలీతో కలిసి చూసే ఓటీటీ సినిమాలు.. వాలంటైన్స్ డే స్పెషల్!