pexels
pexels
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్(12వ తరగతి) పరీక్షలు పూర్తయ్యాయి. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ తర్వాత ఎక్కువ మంది ఇంజినీరింగ్ వైపు దృష్టి పెడుతున్నారు. భారతదేశంలో టాప్ 10 ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 2025 గురించి తెలుసుకుందాం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2025ను జనవరి, ఏప్రిల్ లో రెండు విడతల్లో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయితే IIITలు, NITలు ఇతర ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ సంస్థలలో ప్రవేశం పొందవచ్చు. ఏటా సుమారు 12 లక్షలకు పైగా అభ్యర్థులు జేఈఈ పరీక్షలకు దరఖాస్తు చేస్తుంటారు. జేఈఈ మెయిన్స్ లో ఉత్తీ్ర్ణత సాధించిన అభ్యర్థులకు దేశంలోని 31 NITలు, 26 IIITలు, 38 GFTIలలో ప్రవేశాలు కల్పిస్తారు.
pexels
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష BITSAT 2025. దీనిని ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తుంది. BITSAT అర్హత కలిగిన అభ్యర్థులకు BITS మూడు క్యాంపస్‌లలో ప్రవేశం కల్పి్స్తారు. ప్రతి ఏడాది సుమారు 2 లక్షల మంది దరఖాస్తుదారుల ఈ పరీక్షకు హాజరవుతారు. దాదాపు 2,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. BITS పిలానీ, BITS గోవా, BITS హైదరాబాద్ క్యాంపస్ లలో ప్రవేశాలు కల్పిస్తారు.
బిట్ శాట్(BITSAT 2025)
pexels
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థలో ప్రవేశాల కోసం మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్(MET) ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సంవత్సరానికి 50,000 మందికి పైగా దరఖాస్తుదారులను ఈ పరీక్షకు హాజరవుతారు. ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది.
pexels
VITEEE (VIT ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్)-2025 ను వెల్లూరు ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 5000 అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సీట్ల అర్హత నిర్వహిస్తారు. VIT 2025 విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగే పరీక్ష. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు. పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. VIT చెన్నై, VIT వెల్లూరు, VIT ఆంధ్రప్రదేశ్, VIT భోపాల్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
pexels
SRM జాయింట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (SRMJEEE)ను SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తుంది. ఇందులో 7,000 అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సీట్లలో ప్రవేశాల కోసం SRMJEE 2025 కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఏటా దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంక్ పొందిన 1000 మంది IIT JEE ర్యాంక్ హోల్డర్లకు డైరెక్ట్ గా ప్రవేశాలు కల్పిస్తారు.
pexels
కర్ణాటకలోని మెడికల్, డెంటల్, ఇంజినీరింగ్ ప్రైవేట్ కళాశాలల సంఘాలు, ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజినీరింగ్ అండ్ డెంటల్ కాలేజీస్ (COMEDK) COMEDK UGET పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ప్రవేశ పరీక్ష దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాలలో జరుగుతుంది. దాదాపు 20,000 B.Tech సీట్లు అందిస్తున్నారు. COMEDK UGETతో అనుబంధంగా సుమారు 181 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
pexels
కర్ణాటక ఎగ్జామ్స్ అథారిటీ ప్రతి సంవత్సరం B.Tech, B.Arch ప్రవేశాల కోసం కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (KCET) నిర్వహిస్తుంది. దీనిని ఇంగ్లీష్, కన్నడ మాధ్యమంలో నిర్వహిస్తుంది.
pexels
పశ్చిమ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ (WBJEE) బీటెక్, బీఫార్మసీ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పరీక్ష.
pexels
మహారాష్ట్రలో BE/BTech కోర్సుల మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్ MHT CET 2025 నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు MHT CETకి హాజరవుతారు. మహారాష్ట్రలో స్థిర నివాసం ఉండి, 12వ తరగతి విద్యార్థులు MHT CET 2025కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. MHT CETకి సిద్ధం కావడానికి అభ్యర్థులు మహారాష్ట్ర HSC సిలబస్‌ను కవర్ చేయాలి.
pexels
ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు...ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్/బీఈ ప్రవేశాలకు ఈఏపీసెట్ నిర్వహిస్తున్నాయి. ఆయా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు అభ్యర్థులు ఈఏపీసెట్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
pexels
Photo: Instagram