వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
May 21, 2025

Hindustan Times
Telugu

ఎరుపు, పసుపు బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ మీ చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచుతుంది. ముడతలను తగ్గిస్తుంది.  

pexels

నారింజ పండ్లు విటమిన్ సి, వాటర్ కంటెంట్ తో నిండి ఉంటాయి. మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా , ప్రకాశవంతంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కణాలను వృద్ధాప్యం నుంచి రక్షిస్తాయి.    

pexels

ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే యోగర్ట్, సౌర్ క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలు గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఆరోగ్యకరమైన గట్ వృద్ధాప్యంతో ముడిపడిన సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది.  

pexels

సాల్మన్, సార్డిన్స్ వంటి ఫ్యాటీ ఫిష్ లలో ఒమేగా-3, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సాగేలా ఉంచడంలో, ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి.  

pexels

పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి.  

pexels

స్ట్రా బెర్రీస్, రాస్పెబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బ తీసే, ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. బెర్రీస్ బ్రెయిన్ ఆరోగ్యోనికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.   

pexels

వాల్ నట్స్, బాదం, చియా సీడ్స్, అవిసె గింజల్లో హెల్తీ ఫ్యాట్స్, ముఖ్యంగా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

pexels

బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ వంటి కూరగాయలు శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో, కాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను సజావుగా ఉంచుతుంది. 

pexels

డార్క్ చాకెట్ల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణను పెంచుతాయి. సూర్యరశ్మి నుంచి కూడా రక్షిస్తాయి.  

pexels

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash