ఇవాళ సాయంత్రంలోపు ఇలా దీపం వెలిగిస్తే ఎన్నో శుభఫలితాలు.. పితృ దేవతల ఆశీర్వాదం!

By Sanjiv Kumar
Jan 29, 2025

Hindustan Times
Telugu

పౌష్యమాస అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. 2025 జనవరి 29న మౌని అమావాస్య వచ్చింది.

అమావాస్య రోజున పితృదేవతలు భూమి మీదకు వస్తారని నమ్ముతారు. కాబట్టి, పితృదేవతల పేరు మీద దీపం వెలిగించాలి.

మౌని అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం, దానం, శ్రాద్ధం చేయడంతో పాటు దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం.

పితృదేవతలకు దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. దీపాన్ని ఎలా, ఎప్పుడు వెలిగించాలో తెలుసుకుందాం.

పలు శాస్త్రాల విశ్వాసం ప్రకారం, పితృదేవతల మార్గంలో చీకటి ఉండకూడదు. అందుకే దీపం వెలిగిస్తారు. దీనివల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు.

పితృదేవతలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, సూర్యాస్తమయానికి కొంత సమయం ముందు దీపం వెలిగించాలి, దీనివల్ల వారి మార్గంలో చీకటి ఉండదు.

పిప్పలి (రావి) చెట్టు దగ్గర లేదా దక్షిణ దిశలో దీపం వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

మట్టి దీపంలో ఆవనూనె (mustard oil) పోసి, పత్తి వత్తితో దీపం వెలిగించండి.

గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash