మీరు ఎంచుకున్న రంగంలో విజేతగా నిలవాలంటే ఈ అలవాట్లు ఉండితీరాలి..

By Sudarshan V
Feb 08, 2025

Hindustan Times
Telugu

ప్రతిరోజూప్రణాళిక సిద్ధంగా ఉండాలి. దానిని ఒక డైరీలో రాయండి. దానిని అనుసరించడానికి ప్రయత్నించండి.

టైమ్ వేస్ట్ చేసే అలవాట్లకు దూరంగా ఉండండి. అవసరమైన మేరకే సెల్ ఫోన్ల వంటి గ్యాడ్జెట్లను ఉపయోగించండి.

విజేతలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి కనీసం అరగంట ఇంట్లోనే స్వీయ శిక్షణ పొందుతారు.

దాదాపు విజేతలందరికీ ఉన్న ఒక అలవాటు పుస్తక పఠనం. వారు ఇతర విజేతల  అనుభవాలు, వ్యూహాల గురించి చదువుతారు.

విజేతలకు ఉన్న మరో మంచి అలవాటు ఉదయాన్నే నిద్ర లేవడం. అలాగే, ప్రతీ ఉదయం వారు వ్యాయామం, ధ్యానం, శ్వాస సాధన వంటివి ప్రాక్టిస్ చేస్తారు. 

ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు తాము నేర్చుకున్న విషయాలను డైరీలో రాసుకుంటారు.

 కుటుంబ సభ్యులు, స్నేహితుల వంటి తమ ప్రియమైన వారితో కాసేపు సమయం గడిపి సేదతీరుతారు. 

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest