పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పేందుకు 5 చిట్కాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 22, 2025

Hindustan Times
Telugu

ఆరోగ్యకరమైన పోషకాలు ఉండే ఆహారాలు తినడాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. దీనివల్ల వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు జీవితాంతం వాటిని పాటించే అవకాశం ఉంటుంది. 

Photo; Pexels

పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాలను (హెల్దీ ఫుడ్స్) అలవాటు చేసుకునేలా తల్లిదండ్రులు కొన్ని మార్గాలు పాటించాలి. వాటి ద్వారా పిల్లలు వాటిని ఇష్టంగా తింటారు.  చిన్నారులకు హెల్దీ ఫుడ్స్ అలవాటు చేసే టిప్స్ ఇవి.

Photo; Pexels

ఆరోగ్యకరమైన ఆహారాలు తింటే శరీరానికి, ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంత మేలు జరుగుతుందో పిల్లలకు ఓపికగా వివరంగా చెప్పాలి. కూరగాయలు, పండ్లు, నట్స్, పప్పు ధాన్యాలు ఎలా మేలు చేస్తాయో వివరించాలి. దీనివల్ల అలాంటి హెల్దీ ఫుడ్స్ తినేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతారు. 

Photo; Pexels

పండ్లు, కూరగాయలను వారికి నచ్చిన షేప్‍ల్లో కట్ చేసి ఇవ్వండి. దీనివల్ల ఇష్టంగా తింటారు. వారికి ఇవి అలవాటు అవుతాయి. వంటకాలు రకరకాల కూరగాయలతో చేస్తే కలర్‌ఫుల్‍గా ఉంటాయి. బాగా తింటారు. 

Photo; Pexels

ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు పిల్లలకు మీరే ఉదాహరణగా ఉండాలి. మీరు అలాంటి ఫుడ్స్ ఇష్టంగా తింటే వారు కూడా ఉత్సాహంగా ఫాలో అవుతారు. హెల్దీ ఫుడ్స్ కూడా టేస్టీగా ఉంటాయని వారికి తరచూ చెబుతుండాలి. 

Photo; Pexels

వంట చేయడంలో పిల్లలను కూడా భాగస్వాములను చేయాలి. వంట చేస్తూ ఏది ఆరోగ్యానికి ఎంత మంచిదో వారికి చెప్పాలి. పోషకాలు వేటిలో ఉంటాయో.. ఎలా చేసుకుంటే మంచిదో వివరించాలి. దీనివల్ల ఆహారం విషయంలో జాగ్రత్తలు పడతారు. 

Photo; Pexels

పిల్లలకు ప్రాసెస్డ్, ఫ్రైడ్, షుగరీ, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినిపించకూడదు. మారాం చేస్తే.. వాటి వల్ల కలిగే నష్టాలను వివరించాలి. వాటికి ప్రత్యామ్నాయంగా పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఇవ్వాలి. పండ్లు, నట్స్, విత్తనాలు లాంటి వాటిని స్నాక్స్‌గా ఇవ్వొచ్చు. దీనివల్ల వారికి హెల్దీ ఫుడ్ అలవాటు అవుతుంది. 

Photo; Pexels

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు