స్మోకింగ్ మానేయాలనుకున్నా.. మనసు లాగేస్తోందా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 01, 2025

Hindustan Times
Telugu

ధూమపానం (స్మోకింగ్) ఆరోగ్యానికి అన్ని రకాలుగా చేటు చేస్తుంది. క్యాన్సర్లు, ఊపితిత్తుల రోగాలు లాంటి చాలా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్‌ను పెంచేస్తోంది. అందుకే సిగరెట్లు, బీడీలు తాగడం లాంటి స్మోకింగ్ అలవాట్లు ఉంటే వెంటనే మానేస్తే ఆరోగ్యానికి మంచిది. 

Photo: Pexels

సిగరెట్లు లాంటివి మానేద్దామని కొందరు నిర్ణయించుకున్నా.. వాటిపైనే మనసు లాగేస్తుంటుంది. దీంతో మళ్లీ స్మోకింగ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే స్మోకింగ్‍కు దూరంగా ఉండేందుకు సహకరిస్తాయి. అవేవంటే..

Photo: Pixabay

ముందు మీ చుట్టుపక్కల సిగరెట్లు, బీడీలు లాంటి పొగాకు ఉత్పత్తులు, అగ్గిపెట్టెలు, లైటర్లు లాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసేయండి. మీ కళ్లకు కనిపించకుండా చేసుకోండి. ఇవి కనిపించకపోతే స్మోకింగ్ ధ్యాస తగ్గుతుంది. మీరు స్మోకింగ్ మానేయాలనుకుంటున్నట్టు ఇంట్లో వాళ్లకు చెప్పి వారి సహకారం అడగండి.

Photo: Pixabay

ఒకవేళ స్మోకింగ్ చేయాలని మనసు లాగేస్తుంటే వేరే పనులపై దృష్టిని మరల్చండి. మ్యూజిక్ వినడం, పెట్‍తో ఆడుకోవడం, స్నేహితులకు కాల్ చేయడం లాంటి వేరే విషయాల్లో బిజీ అవండి. దీనివల్ల ఆలోచనలు మారతాయి. 

Photo: Pexels

స్మోకింగ్ చేయాలనిపిస్తుంటే స్ట్రెస్ బాల్, స్క్వీజ్ బాల్ లాంటివి చేతిలో పెట్టుకొని  ప్రెస్ చేస్తూ ఉండొచ్చు. ఇవి మీ ఆందోళన, కంగారును తగ్గిస్తాయి. 

Photo: Pexels

అసలు ఎందుకు స్మోకింగ్ మానేయాలని అనుకుంటున్నారో గుర్తు చేసుకోవాలి. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీనివల్ల మనసును కంట్రోల్ చేసుకోవచ్చు. 

Photo: Pexels

స్మోకింగ్ మానేయాలని అనుకుంటే నికోటిన్ రిప్లేస్‍మెంట్ థెరపీ (ఎన్ఆర్టీ) తీసుకోవచ్చు. ఈ మెడికేషన్ స్మోకింగ్ మానేందుకు తోడ్పడుతుంది. సంబంధిత నిపుణులను సంప్రదించే సలహాలు తీసుకొని పాటించవచ్చు.

Photo: Pexels

గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా లాభాలు

PEXELS