తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ముఖ్యమైన టిప్స్

Photo Credit: Unsplash

By Chatakonda Krishna Prakash
May 17, 2023

Hindustan Times
Telugu

రైల్ తత్కాల్ టికెట్లు పొందడం కాస్త కష్టమైన విషయమే. చాలాసార్లు ఆన్‍లైన్‍లో బుకింగ్ పూర్తిచేసే లోపే తత్కాల్ టికెట్లు అయిపోతుంటాయి. 

Photo Credit: Unsplash

అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Photo Credit: Unsplash

తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందే మాస్టర్ లిస్ట్ క్రియేట్ చేసుకొని.. ప్యాసింజర్ల వివరాలను స్టోర్ చేసుకోండి. 

Photo Credit: Pexels

ఐఆర్‌సీటీసీ వెబ్‍సైట్/యాప్‍లో మై ప్రొఫైల్ సెక్షన్‍లోకి వెళ్లి మాస్టర్ లిస్టును క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ల వివరాలను స్టోర్ చేసుకోవచ్చు. 

Photo Credit: Unsplash

తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయ్యే 3 నుంచి 5 నిమిషాల ముందే ఐఆర్‌సీటీసీ అకౌంట్‍తో లాగిన్ అయి ఉండాలి.

Photo Credit: Unsplash

రైలులో ఏసీ క్లాస్‍లకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. నాన్-ఏసీ క్లాస్‍లకు ప్రతీ రోజు ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. 

పేమెంట్ త్వరగా అయ్యేందుకు మొబైల్ వాలెట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాంటి పేమెంట్ ఆప్షన్‍లను ఎంపిక చేసుకోవాలి. 

Photo Credit: Unsplash

వీలైతే ఎక్కువ డివైజ్‍ల్లో, వివిధ ఐఆర్‌సీటీసీ అకౌంట్ల ద్వారా ఏకకాలంలో ట్రై చేస్తే తత్కాల్ టికెట్లు పొందే అవకాశాలు మెరుగుపడతాయి.

మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.

Image Credit Unsplash