ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే..! ఈ టిప్స్ తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 12, 2025
Hindustan Times Telugu
ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యమైనది. రాత్రిపూట తగినంత నిద్రను ఉంటే మంచి శక్తితో చురుకుగా ఉంటారు. ఇందుకోసం కొన్ని టిప్స్ పాటించవచ్చు.
image credit to unsplash
ముఖ్యంగా రాత్రి సమయంలో అతిగా భోజనం చేయవద్దు. సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలి.
image credit to unsplash
టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటితో రాత్రి వేళ ఎక్కువ సమయం గడపవద్దు. ఫోన్ నుంచి విడుదలయ్యే నీలి రంగు కాంతి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
image credit to unsplash
నిద్రకు సిద్ధమయ్యే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినో యాసిడ్ శరీరంలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చక్కగా నిద్రపడుతుంది.
image credit to unsplash
రాత్రి సమయంలో టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కేక్స్ తీసుకోకూడదు. వీటిలో ఉండే షుగర్, కెఫిన్లు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
image credit to unsplash
రోజువారీ వ్యాయామం ద్వారా నిద్రలేమి లక్షణాలను నియంత్రించవచ్చు. రోజూ తగినంత వ్యాయామం చాలా ముఖ్యం. ప్రశాంతమైన గాఢ నిద్ర, ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందడానికి ఉదయం వ్యాయామం చేయాలి.
image credit to unsplash
నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం కేటాయించి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.