పసుపును డైట్‍లో ఎక్కువగా తీసుకునేందుకు టిప్స్ ఇవి.. ఫాలో అవండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash May 17, 2025
Hindustan Times Telugu
పసుపులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం దగ్గరి నుంచి గుండె ఆరోగ్యం వరకు చాలా ప్రయోజనాలను ఇది కల్పిస్తుంది. అయితే, ఆహారాల్లో పసుపును మరీ ఎక్కువగా వేసుకోలేం. తమ డైట్‍లో పసుపు ఎక్కువగా తీసుకోవాలని కొందరు అనుకుంటుంటారు. కానీ ఎలా అని ఆలోచిస్తుంటారు.
Photo: Pexels
వంటకాల్లోనే కాకుండా పసుపును ఎక్కువగా తీసుకునేందుకు కొన్ని టిప్స్ పాటించవచ్చు. అలాంటి ఆరు చిట్కాలు ఇక్కడ చూడండి.
Photo: Pexels
పసుపు టీ చేసుకొని తాగొచ్చు. పసుపును నీటిలో వేసి మరగబెట్టి రుచికి సరిపడా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు. ఇలా పసుపును సులువుగా తీసుకోవచ్చు.
Photo: Pexels
గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగొచ్చు. కావాలంటే మిరియాలు, అల్లం లాంటివి కూడా వేసుకోవచ్చు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. అంతలా శరీరానికి ఇది మేలు చేస్తుంది. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగానూ తాగొచ్చు.
Photo: Pexels
సలాడ్లలో కూడా కాస్త పసుపు వేసుకోవచ్చు. దీనివల్ల కూరగాయల ముక్కల టేస్ట్ పెరుగుతుంది. పోషకాలు విలువ కూడా అధికమవుతుంది. పసుపును మరింత తీసుకున్నట్టు అవుతుంది.
Photo: Pexels
పసుపును స్మూతీల్లోనూ కలుపుకోవచ్చు. దీంతో టేస్ట్ కూడా బాగా ఉంటుంది. యాంటీఇన్‍ప్లమేటరీ గుణాలు కూడా మెండుగా ఉంటాయి.
Photo: Pexels
కోడిగుడ్లతో ఆమ్లెట్ లాంటి వంటకాలు చేసేటప్పుడు చాలా మంది పసుపు వేయరు. వాటిల్లోనూ పసుపు వేస్తే మరింత ఎక్కువ తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.