మీ శరీరంలో రక్తహీనత ఉందా! ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 06, 2025
Hindustan Times Telugu
శరీరంలో రక్తహీనత (అనేమియా) ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రక్తం తక్కువగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన మందులు వాడటంతో పాటు కొన్ని అలవాట్లు పాటించాలి.
Photo: Pexels
రక్తహీనత సమస్యను కొన్ని జాగ్రత్తలు తగ్గించగలవు. బాడీలో బ్లడ్ పెరిగేలా చేయగలవు. అలాంటి ఐదు ముఖ్యమైన టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గేందుకు తోడ్పడతాయి. పాలకూర, కాయధాన్యాలు, నట్స్, కోడిగుడ్లు, రెడ్‍మీట్, చేపలు లాంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకుంటే బాడీలో బ్లడ్ పెరిగేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
రక్తహీనత సమస్య తగ్గాలంటే టీ, కాఫీ తాగడాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఆహారం తీసుకునేందుకు ముందు, తర్వాత రెండు గంటలు ఇవి తాగకూడదు. ఇవి తాగడం వల్ల శరీరం ఐరన్‍ను మెరుగ్గా శోషించుకోలేదు. అనేమియా ఉన్న వారు టీ, కాఫీ పూర్తిగా మానేస్తే మంచిది.
Photo: Pexels
విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. ఇవి తీసుకోవడం వల్ల ఐరన్‍ను శరీరం బాగా శోషించుకోగలదు. దీంతో రక్తహీనత సమస్య తగ్గేందుకు విటమిన్ సీ ఉపయోగపడుతుంది. నారింజ, నిమ్మ, బెర్రీలు, పాలకూర, బ్రోకలీ లాంటి వాటిలో ఆ విటమిన్ పుష్కలం.
Photo: Pexels
రక్తహీనత సమస్య ఉన్న వారు బీట్‍రూట్, అరటి పండును రెగ్యులర్‌గా తీసుకోవాలి. బీట్‍రూట్‍లో ఐరన్ మెండుగా ఉంటుంది. అరటిలో ఐరన్‍తో పాటు ఫోలెట్, విటమిన్ సీ, పొటాషియం పుష్కలం. హిమోగ్లోబిన్ పెరిగేందుకు ఈ రెండు బాగా తోడ్పడతాయి.
Photo: Pexels
వంటకాలను కాస్ట్ ఐరన్ పాత్రల్లో వండుకోవాలి. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‍కు మేలు జరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గేందుకు ఇది కూడా కాస్త ఉపకరిస్తుంది.
Photo: Pexels
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?