జంటగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి
Photos: Pexels
By Chatakonda Krishna Prakash Jan 19, 2025
Hindustan Times Telugu
మీ భాగస్వామితో కలిసి బరువు తగ్గేందుకు ప్రయత్నించడం వల్ల మోటివేషన్‍గా ఉంటుంది. ఇద్దరి మధ్య బంధం కూడా మరింత బలపడుతుంది. ఇద్దరూ వెయిట్ లాస్ కావాలంటే కలిసి ప్లానింగ్ చేసుకుంటే చాలా మేలు.
Photo: Pexels
జంటగా బరువు తగ్గాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే మరింత మెరుగ్గా ఉంటుంది. ఆ సూచనలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
జీవిత భాగస్వాములు ఇద్దరూ కలిసే వ్యాయామం చేయాలి. వారి శరీరానికి తగ్గట్టుగా వ్యాయామాలు వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నా.. ఒకే సమయంలో ఒకే చోట వర్కౌట్స్ చేయాలి.
Photo: Pexels
యోగా, జిమ్, వాకింగ్, రన్నింగ్ లాంటివి జంటగా చేయాలి. బరువు తగ్గేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం.
Photo: Pexels
బరువు తగ్గేందుకు ఆహారం కూడా చాలా ముఖ్యం. అందుకే ఇద్దరూ కలిసి పోషకాలతో కూడిన ఆహారం ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరూ కలిసే పోషకాలు ఉండే ఫుడ్ తయారు చేయాలి, తినాలి.
Photo: Pexels
ఎంత బరువు తగ్గాలనుకుంటున్నామనేది ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. సాధ్యమయ్యే విధంగా, వాస్తవికంగా ఈ గోల్స్ ఉండాలి. ఇద్దరి లైఫ్‍స్టైల్‍కు, సమయాలకు అనుగుణంగా అన్నీ ప్లాన్ చేసుకోవాలి.
Photo: Pexels
బరువు తగ్గే ప్రయత్నంలో మోటివేషన్ చాలా ముఖ్యం. సరైన ఫలితాలు రాక ఇద్దరిలో ఏ ఒక్కరైనా నిరాశగా ఉంటే మరొకరు ప్రేరణ ఇవ్వాలి. ప్రయత్నాన్ని నిలకడగా కొనసాగించాలి. వెయిట్ లాస్ గోల్ సాధించేలా ఒకరికొకరు సాయం చేసుకోవాలి.