చలి వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటితో పాటు గొంతు గరగర, నుస, కఫం సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. గొంతు గరగర తగ్గించేందుకు ఈ 8 ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి
pexels
By Bandaru Satyaprasad Feb 05, 2025
Hindustan Times Telugu
విటమిన్ సి పండ్లు- విటమిన్ సి పండ్లను తినడం వల్ల గొంతులో గరగరను తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో ఎక్కువగా యాంటీ హిస్టమైన్ ఉంటుంది. ఇది ఎలర్జీలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మ, నారింజ, బొప్పాయి, కివి లాంటి విటమిన్ సి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
pexels
ఉప్పు నీరు- గొంతు గరగర, నొప్పి ఉంటే గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించండి. ఇలా చేస్తే గొంతు గరగర నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. రోజూ ఏడెనిమినిది గ్లాసుల మంచి నీళ్లు తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి.
pexels
వెల్లుల్లి- గొంతు గరగర, ఎలర్జీల వంటి సమస్యల్ని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇందుకోసం పచ్చి వెల్లుల్లిని నేరుగా తినవచ్చు. ఎలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తింటే మంచిది.
pexels
యాపిల్ సైడర్ వెనిగర్- యాపిల్ సైడర్ వెనిగర్ గొంతుల గరగర, నొప్పి, ఎలర్జీని తగ్గించే గుణాలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గడం, జుట్టు సమస్యలకు ఈ వెనిగర్ బాగా పనిచేస్తుంది.
pexels
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలర్జీ రియాక్షన్లు, గొంతు గరగర తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ఎక్కువగా లభించే వాల్‌నట్స్, ఫిష్ ఆయిల్, అవిసె గింజలను మీ ఆహారాల్లో చేర్చుకోండి.
గ్రీన్ టీ - బరువు నియంత్రణతో పాటు ఎలర్జీలను తగ్గించడంలో గ్రీన్‌టీ ఉపయోగపడుతుంది. గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు గొంతు నుస, నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.
pexels
అల్లం - అల్లంలో గొంతునొప్పిని తగ్గించే లక్షణాలు అధికంగా ఉంటాయి. గొంతు గరగరతో బాధపడే వారు రోజూ అల్లాన్ని వంటల్లో ఉపయోగించడం మంచిది. అల్లం టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.