ఈవారం ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన 6 సినిమాలు: స్ట్రీమింగ్ వివరాలు

Photo: X

By Chatakonda Krishna Prakash
May 10, 2025

Hindustan Times
Telugu

ఈ మే రెండో వారం ఓటీటీల్లోకి తెలుగులో సినిమాలు బాగానే క్యూకట్టాయి. ఐదు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఓ తమిళ మూవీ డబ్బింగ్‍లో ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం వచ్చిన ఆ ఆరు చిత్రాలు ఏవి.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే.. 

Photo: X (Twitter)

తమన్నా భాటియా లీడ్ రోల్ చేసిన ‘ఓదెల 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ చిత్రం థియేటర్లలో డిజాస్టర్ అయింది.  

Photo: X (Twitter)

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. 

Photo: X (Twitter)

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాక్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రం థియేట్రికల్ రన్‍లో ప్లాఫ్ అయింది. 

Photo: X (Twitter)

తెలుగు యాక్షన్ కామెడీ మూవీ ‘రాబిన్‍హుడ్’ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. 

Photo: X (Twitter)

తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ‘కాలమేగా కరిగింది’ సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి లీడ్ రోల్స్ చేశారు. 

Photo: X (Twitter)

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇదే వారం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోగానే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంటర్ అయింది. 

Photo: X (Twitter)

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!