విరాట్ కోహ్లీ ప్రతిరోజూ తినే ఆహారం ఇదే, అందుకే ఫిట్‌గా ఉంటాడు
Virat Kohli/ Instagram
By Haritha Chappa May 13, 2025
Hindustan Times Telugu
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. కోహ్లీ ఫిట్నెస్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో అతను రోజూ ఏం తింటాడో తెలుసుకునేందుకు ఎక్కువమంది అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
Virat Kohli/ Instagram
విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఫ్రీక్. తనను తాను ఫిట్ గా ఉంచుకునేందుకు ఇష్టపడతాడు. సోషల్ మీడియాలో తరచూ జిమ్ గురించి , వ్యాయామం గురించి పోస్టులు పెడుతుంటారు.
Virat Kohli/ Instagram
కోహ్లీ సింపుల్ లైఫ్ ను ఇష్టపడతాడు. అతను పూర్తి శాకాహారి.తన ఆహారంలో మొక్కల ఆధారిత ఫుడ్ ను అధికంగా తీసుకుంటారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, ఉదయం లేవగానే పుష్కలంగా నీళ్లు తాగడం కోహ్లీకి అలవాటు.
Virat Kohli/ Instagram
విరాట్ కోహ్లీ ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగుతాడు. నీళ్లు తాగిన తర్వాత వ్యాయామం చేస్తాడు. తేలికపాటి వార్మప్, స్ట్రెచింగ్ వ్యాయామాలు, కార్డియో వంటివి చేస్తారు.
Virat Kohli/ Instagram
దీంతో పాటు విరాట్ కోహ్లీ ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ కూడా చేస్తుంటాడు. కోహ్లీ ప్రతి ఉదయం అల్పాహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఇందులో అవోకాడో ఉండేలా చూసుకుంటాడు. మొలకెత్తిన గింజలను తింటాడు.
Virat Kohli/ Instagram
కోహ్లీ తినే నూనెలో వేయించిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడరు. ఆయన తినే ఆహారంలో 90 శాతం ఉడకబెట్టినవే ఉంటాయి.
Virat Kohli/ Instagram
కోహ్లీ సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి ముట్టుకోడు. అంతేకాదు విరాట్ కోహ్లీ డైట్ లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు చోటు లేదు.
Virat Kohli/ Instagram
కోహ్లీ ఆహారంలో చక్కెరకు స్థానం లేదు. పంచదారతో చేసిన పదార్థాలను ఆయన పూర్తిగా తినడు. అలాగే ఆయన ఖచ్చితంగా 8 నుండి 9 గంటలు నిద్రపోతాడు.
Virat Kohli/ Instagram
ఇలాంటి మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు