బెంగళూరు నుంచి ఇవి మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్నాయట..

Photo Credit: Pexels

By Sudarshan V
Apr 15, 2025

Hindustan Times
Telugu

గత 20 ఏళ్లలో బెంగళూరు చాలా మారిపోయింది. కానీ ఒకప్పుడు మనకు తెలిసిన నగరం నుంచి కొన్ని నిశ్శబ్దంగా కనుమరుగవుతున్నాయి.

Photo Credit: Pexels

ఒక రెడ్డిట్ పోస్ట్ ఈ ప్రశ్నను అడిగింది. ఆ ప్రశ్నతో బెంగళూరు అభిమానులు కాసేపు గతంలోకి జారుకున్నారు.

Photo Credit: Pexels

బెంగళూరు నగరం చాలా మారిందని, ఆ ఛార్మ్ పోయిందని అభిమానులు అంటున్నారు.

Photo Credit: Pexels

ఒకప్పుడు బెంగళూరులో సర్వసాధారణంగా కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా కనిపించడమే లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Photo Credit: Pexels

బెంగళూరుకే ప్రత్యేకమైన మర్యాదపూర్వక పలకరింపులు మాయమయ్యాయి. అంతా కృత్రిమంగా మారిందని పలువురు అంటున్నారు.

Photo Credit: File Photo

బెంగళూరుకు ఒకప్పుడు రాక్ అండ్ మెటల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు? లౌడ్ "దిన్-చిక్" సంగీతం క్లబ్బులను శాసిస్తుందని వినియోగదారులు అంటున్నారు.

Photo Credit: File Photo

మంచి ప్లే లిస్టులు ఉన్న చౌకైన పబ్ లు బెంగళూరులో కనుమరుగవుతున్నాయని అభిమానులు వాపోతున్నారు.

Photo Credit: File Photo

"ఇడ్లీ కూడా మారుతోంది" అని ఒకరు చమత్కరించారు. సంప్రదాయ కన్నడ వంటకాలు కనిపించడం లేదు.

Photo Credit: Pexels

బెంగళూరులో పెద్ద పెద్ద చెట్లు, పాత బంగ్లాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇప్పుడు అంతా గాజు భవనాలు, ఆకాశ హార్మ్యాలు..

Photo Credit: Pexels

బెంగళూరులో హోమ్ గ్యారేజీలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఫుట్ పాత్ లపైనే పార్కింగ్ చేస్తున్నారు.

Photo Credit: Pexels

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram