శరీరం ఆరోగ్యంగా, ఫిట్‍గా ఉండాలంటే జీవక్రియ రేటు సరిగా ఉండాలి. జీవక్రియ నెమ్మదిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రకాల అలవాట్ల వల్ల జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. జీవక్రియను తగ్గించే ఆ అలవాట్లు ఏవంటే..
Photo: Pexels
రోజులో ఎక్కువసేపు కదలకుండా విశ్రాంతి తీసుకోవడం, ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుంది. అందుకే పగటి పూట ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోకుండా కదులుతూ.. చురుగ్గా ఉండాలి.
Photo: Pexels
శారీరక శ్రమ తగ్గడం వల్ల కూడా జీవక్రియ రేటు డౌన్ అవుతుంది. అందుకే ప్రతీ రోజూ వ్యాయామం చేయాలి. అందుకే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కాకుండా చూసుకోవాలి.
Photo: Pexels
తక్కువసేపు నిద్రించడం వల్ల కూడా జీవక్రియలు నెమ్మదిస్తాయి. అందుకే ప్రతీరోజు 7 గంటల నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Photo: Pexels
ఎక్కువ ఒత్తిడి వల్ల కూడా శరీరంలో జీవక్రియ రేటు తగ్గుతుంది. ఒత్తిడి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకునే చిట్కాలు పాటించి.. ప్రశాంతంగా ఉండాలి.
Photo: Pexels
అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల కూడా జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. ఎక్కువగా ఫ్రై చేసిన, ప్యాక్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుతుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి.
Photo: Pexels
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.