ఎముక సాంద్రత తక్కువగా ఉండటం, శరీరంలో కాల్షియం, ఐరన్ తక్కువగా ఉండటం, ఎముక కోత కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తాయి.
Unsplash
By Anand Sai Jun 22, 2025
Hindustan Times Telugu
మనం వయసు పెరిగే కొద్దీ చాలా మందికి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తాయి. మన చెడు అలవాట్లకు కూడా ఇవి వస్తాయి.
Unsplash
పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఒకే చోట 8 గంటలకు పైగా కూర్చుని ఎక్కువసేపు పని చేస్తారు. రక్త ప్రసరణ సరిగా ఉండక వెన్నునొప్పి, మోకాలి నొప్పికి దారితీస్తుంది.
Unsplash
పని చేసేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం కూడా చాలా ముఖ్యం. సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోకుంటే మెడ నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది.
Unsplash
కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు. దీనివల్ల మోకాళ్ల నొప్పి కూడా వస్తుంది. ప్రతి 20 నుండి 30 నిమిషాలకు లేచి కదలండి లేదా మోకాళ్లకు సరిపోయే తేలికపాటి వ్యాయామం చేయండి. కీళ్లపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
Unsplash
వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. కొంతమంది ఈ వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తారు. మోకాలు, తుంటి, వెన్నెముక కోసం తగిన వ్యాయామాలు చేయాలి.
Unsplash
కొల్లాజెన్ ముఖ్యమైన ప్రోటీన్లలో ఒకటి. చర్మం, ఎముకలు, గోర్లు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ సరిగా తీసుకోకపోతే కీళ్ల నొప్పులు కనిపిస్తాయి.
Unsplash
చక్కెర ఆహారాలు, నూనె పదార్థాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం కూడా మోకాలి నొప్పికి కారణాలు. వాపును కూడా పెంచుతుంది.
Unsplash
అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..