చలికాలంలో తప్పక తినాల్సిన గ్రీన్ ఫుడ్స్ ఇవి 

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jan 28, 2025

Hindustan Times
Telugu

వాతావరణం చల్లగా ఉండే కాలంలో ఆకుపచ్చ ఆహారాలు (గ్రీన్ ఫుడ్స్) తినడం చాలా ముఖ్యం. వీటిలో ఉండే పోషకాలు చలికాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలా శీతాకాలంలో తప్పక తీసుకోవాల్సిన ఆకుపచ్చ ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

పాలకూరలో విటమిన్ ఏ,సీ,కే, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల రోగ నిరోధక శక్తి చాలా మెరుగవుతుంది. అందుకే చలికాలంలో మీ డైట్‍లో పాలకూర ఉండాలి.

Photo: Pexels

బ్రకోలీలో విటమిన్ సీ, సల్ఫరేన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని ఇది పెంచగలదు. పేగుల ఆరోగ్యానికి, జీర్ణానికి కూడా బ్రకోలీ చాలా మేలు చేస్తుంది. 

Photo: Pexels

పుదీనలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తుంది. గొంతు సమస్యలు తగ్గేందుకు ఉపకరిస్తుంది. పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా మేలు. 

Photo: Pexels

కేల్‍లో విటమిన్ సీ, కే, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువే. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచడం సహా అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

మెంతికూరలో విటమిన్ ఏ, సీ, కే, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయగలదు.

Photo: Pixabay

గ్రీన్ యాపిల్‍లో విటమిన్ సీ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరానికి మంచి శక్తిని ఈ పండ్లు ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి శరీరం పోరాడే శక్తిని అధికం చేయగలదు. 

Photo: Pixabay

ఖాళీ పొట్టతో గుడ్డు తినకూడదా? తింటే జరిగే నష్టం ఏమిటి?

Pixabay