గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్ ఉండే ఫుడ్స్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 05, 2024

Hindustan Times
Telugu

శరీరానికి తగినంత ప్రొటీన్ చాలా ముఖ్యం. ఇది తక్కువైతే కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని చాలా మందికి తెలుసు. అయితే, గుడ్డు కంటే ఎక్కువగా ప్రొటీన్ ఉండే కొన్ని ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

బాదంపప్పులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరానికి ప్రొటీన్ బాగా అందుతుంది. మరిన్ని పోషకాలు ఉండడం వల్ల బాదం తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Pexels

క్వినోవా ధాన్యాల్లో ప్రొటీన్ అత్యధికంగా ఉంటుంది. ఫైబర్, ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ ధాన్యాన్ని తీసుకుంటే ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. 

Photo: Pexels

గ్రీక్ యొగర్ట్‌లో కూడా గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. దీన్ని తరచూ తింటే ప్రొటీన్ ఉత్తమంగా శరీరానికి అందుతుంది. 

Photo: Pexels

టోఫులో ప్రొటీన్ అత్యధికంగా ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువగా కావాలనుకునే వారు దీన్ని ప్రతీ రోజూ తినొచ్చు. 

Photo: Pexels

శనగలు, బ్లాక్ బీన్స్, పచ్చిబఠానీల్లోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. 

Photo: Pexels

వాల్‍నట్స్ నానబెట్టుకొని తింటే ఈ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

Photo: Unsplash