ఇటీవలి కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి ఇది.
Image Credit : Unsplash
By Anand Sai Jul 28, 2025
Hindustan Times Telugu
ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే కొలెస్ట్రాల్ సమస్య గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
Image Credit : Unsplash
మన రోజువారీ అలవాట్లు కొన్ని అధిక కొలెస్ట్రాల్‌కు కారణం అవుతాయి. మీకు ఈ అలవాట్లు ఏవైనా ఉంటే మీ కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవడం మంచిది.
Image Credit : Unsplash
మార్కెట్లో లభించే ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ లలో ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటాయి. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
Image Credit : Unsplash
ధూమపానం గుండె ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ట్రైగ్లిజరైడ్‌లు పెరుగుతాయి.
Image Credit : Unsplash
నిరంతర ఒత్తిడి, నిద్ర లేకపోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి సమయంలో శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెంచుతుంది.
Image Credit : Unsplash
స్వీట్లు, శీతల పానీయాలు, కేకులు, తెల్ల బ్రెడ్ లలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
Image Credit : Unsplash
రోజంతా కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణాలు.
Image Credit : Unsplash
అన్ని కూరగాయలలో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దూరంగా ఉంటారు.